బీచ్‌లకు బయలుదేరండి!


Fri,April 12, 2019 12:56 AM

కొందరు పల్లెటూర్లకు పయనమవుతున్నారు. ఇంకొందరు టూర్లు ప్లాన్ చేసుకొని హాయిగా ప్రయాణాలు చేస్తున్నారు. వీలైతే ఈ సమ్మర్‌లో ఈ బీచ్‌లకు వెళ్లండి.
విదేశాలకు వెళ్లాలంటే పాస్‌పోర్ట్, వీసాలు కావాలి. బడ్జెట్ కూడా ఎక్కువ అవుతుంది. భారతదేశంలో ఉన్న బీచ్‌లు చూస్తే చాలు ప్రపంచంలో ఉన్న భిన్నమైన బీచ్‌లన్నింటినీ చుట్టేసినట్టే. ఈ సమ్మర్ మీకు మెమరబుల్‌గా మిగలాలంటే ఈ బీచ్‌లను కచ్చితంగా చూడాలి.

beach

హావ్‌లాక్ బీచ్ :

కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్ నికోబర్ దీవుల్లో ఈ బీచ్‌ని నిశ్శబ్దానికి పర్యాయపదంగా చెప్తారు. స్క్యూబా డైవింగ్, ట్రెక్కింగ్, వాటర్‌గేమ్స్, వంటి ఎన్నో సాహస క్రీడలను ఇక్కడ ప్రయత్నించవచ్చు. ఇటు వెళ్తే ఒకటి రెండు రోజులు కాదు. వారం రోజుల పాటు తిరిగినా పూర్తవ్వని చూడదగ్గ ప్రదేశాలున్నాయి. సముద్రపు ఏనుగుల మీద స్వారీ అయితే చెప్పనక్కర్లేదు.

మరారి బీచ్ :

కేరళలో ఉన్న ప్రతీ బీచ్ అందమైందే. అలప్పిలో ఉన్న మరారి బీచ్ పట్టణానికి నాలుగు వైపులా విస్తరించి ఉంటుంది. నగరానికి దగ్గరగా ఉండడం వల్ల విదేశీయుల తాకిడి ఎక్కువ ఉంటుంది. ఒక్కసారి ఈ బీచ్‌కి వెళ్తే మైమరిచి.. ఈ ప్రపంచం నుంచి వేరే ప్రపంచానికి వెళ్తారు. ఖరీదైన రిసార్టులు ఇక్కడ ఉంటాయి. అవి స్వర్గాన్ని తలపిస్తాయి.

మహాబలిపురం బీచ్ :

మన దేశంలో ఉన్న అత్యంత పరిశుభ్రమైన బీచ్‌లలో ఇది ఒకటి. నిత్యం ఆకట్టుకునే పర్యాటకులు, రకరకాల వంటకాలు, కలర్‌ఫుల్ కార్యక్రమాలు బాగుంటాయి. సాయంత్రం అలల మీద సర్ఫింగ్ చేస్తుంటే చూడాలి గానీ అక్కడినుంచి రావాలనిపించదు. ఇవన్నీ ఇలా ఉంటే.. పాండవుల రథాల వంటి ఏడవ శతాబ్దానికి చెందిన ఎన్నో చారిత్రక ఆధారాలు ఇక్కడ ఉన్నాయి.

ఒరిస్సా బీచ్ :

గోపాల్‌పూర్ బీచ్.. ఇది ఒరిస్సా రాజధాని భువనేశ్వర్‌కు 190 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. గిరిజనులుండే ఈ ప్రాంతమంతా ప్రశాంతంగా ఉంటుంది. చుట్టూ హిందూ దేవాలయాలు, పురాతన కట్టడాలున్న ఈ ప్రాంతం పర్యాటకంగా బాగా అభివృద్ధి చెందింది. ముఖ్యంగా ఇక్కడ పోర్టులోని లైట్‌హౌజ్ అన్నింటికన్నా ప్రత్యేకం.

ఆర్కే బీచ్ :

విశాఖపట్టణంలోని ఆర్కే బీచ్ గురించి తెలుగు ప్రజలకు చెప్పనక్కర్లేదు. మనకు దగ్గరలో ఉన్న అతిపెద్ద బీచ్ ఇదే. ఈ బీచ్ చుట్టూ మ్యూజియంలు, గార్డెన్స్, గేమింగ్ జోన్‌లు ఇలా ఎన్నో సదుపాయాలున్నాయి. విశాఖపట్టణానికి వెళ్తే ఆర్కే బీచ్‌తో పాటు కైలాసగిరి, అరకు, బొర్రాగుహలు ఇలా చాలా పర్యాటక ప్రాంతాలను చుట్టేసి రావొచ్చు.

గోవా బీచ్ :

మానసిక ప్రశాంతత కోసం ఈ మధ్య కాలంలో చాలామంది వెళ్తున్న ప్రాంతం గోవా. ఒక్కటా రెండా వందల సంఖ్యలో బీచ్‌లున్న ప్రాంతం గోవా. అక్కడి భిన్న వాతావరణం సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. గేమ్స్, డీజే నైట్స్ కొత్త లోకాల్లోకి తీసుకెళ్తాయి.

251
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles