బిడ్డల ఆరోగ్యానికి సేంద్రియ దుస్తులు


Sat,February 23, 2019 01:43 AM

ఒక శిశువు పెరుగుతున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అందించే ఆహారం, వేసే బట్టలు, శిశువు ఉండే ప్రదేశం ఎంత పరిశుభ్రంగా ఉండాలి? ఎంత జాగ్రత్తలు తీసుకున్నా ఎక్కడో ఒక మూలనుంచి క్రిముల వల్ల నష్టం కలుగుతూనే ఉంటుంది. అలాంటి సమస్య నుంచి కొంత ఉపశమనం కల్గించేందుకు ఓ యువతి వినూత్న ఆలోచన చేసింది.
organic-clothes
ఎదిగే పిల్లలకు అందించే ఆహారం పౌష్టికమైనదే అనుకుంటాం కానీ అందులో మనకు తెలియకుండా రసాయనాలు కలుస్తాయి. పిల్లలకు వేసే దుస్తులు కూడా రసాయనాలతో తయరవుతాయి. ఇలా రసాయనాలతో తయరైన వస్తువుల చుట్టే అందరి జీవితాలు తిరుగుతున్నాయి. ముఖ్యంగా పిల్లలకు ఇది ప్రమాదకరం. దీని కోసమే ఢిల్లీకి చెందిన శ్వేతా ధరివాల్ అనే యువతి ఆర్గానిక్ క్లాథింగ్‌ను పరిచయం చేసింది. ఎలాంటి రసాయనాలను వాడకుండా దుస్తులు తయారు చేసి పిల్లలకు అందజేస్తుంది. వైట్‌వాటర్ అనే సంస్థను ఏర్పాటు చేసి ఈ విధమైన వస్త్రాలను తయారు చేస్తూ ఇటు పిల్లల ఆరోగ్యానికి, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతుంది. రసాయన రహిత రంగులు, దారాలు, బట్టలు వాడి ఈ దుస్తులు తయారు చేయటం ఈ సంస్థ పని. ఆమె సోదరి అంకిటా ధరివాల్ ఒక గ్రాఫిక్ డిజైనర్. దీంతో దుస్తులను తయారు చేయటంలో కళాత్మకంగా ఆమె సాయపడుతుంది. ఈ సంస్థ ద్వారా దుస్తులు తయారు చేయటంతో పాటు ఇతర మహిళకు సహజ శిక్షణ కూడా ఇస్తున్నారు. మానవ ఆరోగ్యానికి కావాల్సిన ఉత్పత్తులను తయారు చేయటం, వాటిని తక్కువ ధరకు విక్రయించటం వైట్ వాటర్ సంస్థ లక్ష్యం. భారతదేశ సంస్కృతిని కాపాడటం, వస్త్ర సంస్కృతిని కాపాడటం నైతిక ఉద్దేశ్యం అని శ్వేతా అంటున్నది. దీంతో పాటు వైట్ వాటర్ ఆధ్వర్యంలో గ్రామాల్లో ఉండే వస్త్ర కళాకారులను ప్రోత్సస్తున్నారు. చిన్న చిన్న వస్ర్తాలను తయారు చేసే మహిళకు ఆసరాగా నిలుస్తున్నారు. ఆ మహిళను గ్రూపులుగా ఏర్పాటు చేసి వారికి ముడి సరుకు అందించి వస్ర్తాలను తయారు చేయిస్తున్నారు. దీని ద్వారా నాణ్యమైన ఉత్పత్తులు వస్తాయనీ, వేరే చేతుల్లోకి దుస్తులు వెళ్లవని అంటున్నారు శ్వేత. స్థానిక సామాజిక సంస్థలకు మద్దతునిచ్చి, వస్త్రకళలను ప్రోత్సహిస్తూ, సేంద్రియ దుస్తుల పట్ల తల్లిదండ్రులకు, ఇతరులకు అవగాహన కల్పిస్తున్నది.
organic-clothes2

569
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles