బిగ్‌బాస్ 12ను గెలిచింది..


Tue,January 1, 2019 10:51 PM

డిసెంబర్ 30 న అంతా న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమవుతుంటే.. హిందీ బిగ్‌బాస్ అభిమానులు మాత్రం గ్రాండ్ ఫైనల్ ఎపిసోడ్‌తో ఎంజాయ్ చేశారు. బిగ్‌బాస్ సీజన్ 12 విజేతగా దీపికా కక్కర్‌ను ప్రకటించారు. కలర్స్ చానల్‌లో వచ్చే హిందీ బిగ్‌బాస్ 12 విజేతగా ఎవరు నిలుస్తారా? అన్న సందేహం చివరి నిమిషం వరకు గుట్టుగా ఉన్నది. హోస్ట్ సల్మాన్ ఖాన్ విజేత పేరు ప్రకటించాడు. ఆమె గురించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలివి..
dipika-kakar
-దీపికా గెలుపొందినందుకు గానూ ముప్పై లక్షల నగదు బహుమతి అందుకున్నది.
రన్నరప్‌గా క్రికెటర్ శ్రీశాంత్ నిలిచాడు.
-దీపికాతో పాటు బిగ్‌బాస్ ఇంటి సభ్యులు ఫైనల్ వరకు వచ్చిన వాళ్లు 105 రోజులు ఇంట్లోనే ఉన్నారు.
-కలర్స్ చానల్లో ప్రసారమయ్యే ససురాల్ సిమర్ కా సీరియల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానుల్ని
సంపాదించింది.
-ఇన్‌స్టాగ్రామ్‌లో కోటిమంది ఫాలోవర్స్‌ను సంపాదించిన సెలబ్రిటీగా రికార్డు సృష్టించింది. సోషల్‌మీడియాలో ఎప్పటికప్పుడు స్పందిస్తూ పోస్టులు పెడుతూ యాక్టీవ్‌గా ఉంటుంది.
-దీపికా ఆహారప్రియురాలు. తిండి ఎంత ఇష్టమో ఆమె ఇన్‌స్టగ్రామ్ పోస్టులు చూస్తే తెలిసిపోతుంది.
-బిగ్‌హౌస్‌లో ప్రవేశించినప్పటి నుంచి దీపికా సందర్భాన్ని బట్టి స్పందిస్తూ వచ్చింది. తన స్వభావాన్ని మార్చుకోకుండా పరిస్థితులను బట్టి నడుచుకున్నది.
-దీపికా గెలిచిందన్న విషయం తెలిశాక భక్త షోయబ్ ఆమె దగ్గరికి వెళ్లి ఎత్తుకొని ఊరేగించాడు.
-2010లో నీర్ భరే తేరే నైనా దేవి సీరియల్‌తో తెరంగ్రేటం చేసి అతి తక్కువ కాలంలోనే మంచి పేరు సంపాదించింది.
-నటనారంగంలోకి రాకముందు కొంతకాలం జెట్ ఎయిర్‌వేస్‌లో ఎయిర్ హోస్టెస్‌గా పనిచేసింది.
-జలక్ దిక్ లాజా అనే రియాలిటీ షోలో కూడా పాల్గొన్నది.
-తోటి ఉద్యోగి రౌనక్ సామ్సన్‌ని పెళ్లాడి కొంత కాలానికి విడాకులు ఇచ్చేసింది. సహ నటుడు షోయబ్‌తో చనువుగా ఉంటుందని భర్త గొడవ పడి విడాకులు ఇచ్చాడు.
-నాచ్ బలియే అనే డ్యాన్స్ ప్రోగ్రామ్‌లో షోయబ్, దీపికా కలిసి పాల్గొన్నారు. అదే షోలో షోయబ్ లవ్ ప్రపోజ్ చేశాడు. దానికి ఆమె ఎస్ అన్నది.
-దీపికా షోయబ్‌ను పెళ్లాడినప్పుడు రకరకాల వార్తలు చక్కర్లు కొట్టాయి.
-దీపికా తండ్రి ఆర్మీ ఆఫీసర్. ఆర్మీ ఉండే ప్రాంతాల్లో పెరిగింది. దేశభక్తి కూడా ఎక్కువే.
-జేపీ దత్తా పల్టన్ సినిమాలో నటించి బాలీవుడ్ వెండితెరకు పరిచయం అయింది.
AK

541
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles