బస్సంత రికార్డు


Fri,March 1, 2019 01:29 AM

అనగనగా ఐదు వందల బస్సులు.. ఒకచోటు నుంచి ఇంకొక చోటుకు ఒకేసారి బయలుదేరాయి. ఒక్కసారిగా అన్ని బస్సులూ బయలుదేరితే ఎలా ఉంటుంది? ఏది ఏమైనా ముచ్చటగా ఉంటుంది.
bcc
ఒక రోడ్డులో వరుసగా పది బస్సులు వెళ్తేనే వింతగా అనిపిస్తుంది. రెండు వందల బస్సులు ఒకే రంగువి.. ఒకే దారిలో దారి పొడవునా వెళ్తే ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది. 500 బస్సులు అన్నీ ఒకే రంగు.. పచ్చజెండా ఊపగానే గేర్ వేసి పికప్ అందుకొని పరుగులు తీస్తే.. ఆ దృశ్యాన్ని వర్ణించలేం. చూసి ఆనందించడం తప్ప. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వినూత్న ప్రపంచ రికార్డుకు శ్రీకారం చుట్టింది. 500 ప్రభుత్వ బస్సులతో ప్రపంచరికార్డును నెలకొల్పింది. అంతకుముందు అబుదాబిలో 390 బస్సులతో నిర్వహించిన అతిపెద్ద క్యూ లైన్ మీద ఈ రికార్డు ఉన్నది. ఇలా చేయడాన్ని కొందరు వ్యతిరేకించినా కొందరు మాత్రం ప్రశంసిస్తున్నారు. ప్రజలకు కావాల్సింది అభివృద్ది కానీ ఇలాంటి రికార్డు కాదని విరుచుకుపడుతున్నారు. ట్విట్టర్ వేదికగా వందలమంది ఈ విషయం మీద చర్చలో పాల్గొంటున్నారు.

369
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles