బల్లిని తరిమికొట్టండిలా!


Mon,March 25, 2019 01:35 AM

ఇంట్లో బల్లులు తిరుగుతుంటే ఎవరు ఇష్టపడరు. బల్లిని చూసి కొందరు భయపడి ఇంట్లోకి కూడా రారు. కొంతమంది బల్లి శాస్ర్తాన్ని నమ్ముతారు. ఇంట్లోని పురుగులను బల్లి తినేస్తుంది మంచిదే కదా అని మరికొందరు అంటుంటారు. బల్లులు ఇంట్లో ఉండడం నచ్చకుంటే వాటిని ఇలా తరిమికొట్టండి.
balli
-శుభ్రంగా లేని ప్రదేశం, వేడి ఎక్కువగా ఉన్న చోట ఎక్కువ బల్లులుంటాయి. ఫర్నీచర్ ఎప్పటికప్పుడు దులుపుతుండాలి. వాతావరణం చల్లగా, శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.
-సిట్రస్ జాతి మొక్కంటే బల్లికే కాకుండా ఎలాంటి పురుగులకు పడదు. నిమ్మగడ్డిని కాల్చి ఆ పొగని ఇంట్లో వ్యాపించేలా చేయండి. దీని నుంచి వచ్చే వాసనకు పారిపోతుంది.
-కర్పూరం అందరి ఇంట్లో కామన్‌గా ఉంటుంది. మనుషులకి కర్పూరం అంటే ఎంత ఇష్టమో బల్లికి అంత కష్టం. ఇంకెందుకు ఆలస్యం. బల్లులు వచ్చే దగ్గర కర్పూరం బిల్లలు ఉంచితే అవి రాకుండా ఉంటాయి.
-బల్లులు ఎక్కువగా దొడ్డిదారుల నుంచి ఇంట్లోకి ప్రవేశిస్తాయి. అంటే గోడల్లో ఉండే పగుళ్ళు, రంధ్రాల నుంచి వస్తాయి. ఇలాంటి రహస్య ద్వారాలు ఇంట్లో ఉంటే వెంటనే మూసేయండి.
-వాతావరణంలో సడెన్‌గా మార్పు జరిగితే బల్లులు తట్టుకోలేవు. కాబట్టి ఇంట్లోని టెంపరేచర్‌ను అప్పుడప్పుడు మారుస్తుండాలి. స్ప్రే బాటిల్‌లో ఐస్ క్యూబ్స్ వేసి బల్లిపై చల్లితే చలికి తట్టుకోలేక అక్కడి నుంచి పారిపోతాయి.
-బల్లి తినే ఆహారం ఇంట్లో లేకుండా చూసుకోవాలి. నీళ్లు ఒకచోట ఆగి ఉంటే అక్కడికి పురుగులు వస్తాయని బల్లులు పసిగడుతాయి. కాబట్టి ఇల్లు శుభ్రంగా ఉండేలా చేసుకోవాలి.
-నెమలీక అంటే బల్లులకి భయమంటారు. వినడానికి విచిత్రంగా ఉన్నా ఒకసారి ప్రయత్నిస్తే తప్పేముంది. నెమలీకని తాడుకి కట్టి బల్లులు ఉన్నచోట వేలాడదీసి గాలికి కదిలేలా కట్టాలి.

4024
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles