బర్త్‌డే కొవ్వొత్తిని ఊదకండి


Mon,December 31, 2018 01:08 AM

పుట్టినరోజు అంటే పిల్లలందరికీ ఆనందమే. స్నేహితులు, బంధుమిత్రులతో కలసి పుట్టినరోజును సరదాగా జరుపుకోవాలని అందరూ కోరుకుంటారు. అదంతా బాగానే ఉన్నా, కేకుపై కొవ్వొత్తి వెలిగించి దాన్ని ఊదటం మాత్రం మంచిది కాదంటున్నారు పరిశోధకులు.
Girl-Birthday
సాధారణంగా దీపం వెలిగించాలే కానీ ఆర్పివేయకూడదన్న ఉద్దేశంతో పుట్టినరోజున కొవ్వొత్తి ఊదే కార్యక్రమాన్ని విరమించుకుంటున్నారు కొందరు. ఇది ఒకందుకు మంచిదే. అయితే ఆ నమ్మకం ఎలా ఉన్నా కేకు మీద కొవ్వొత్తులు వెలిగించి వాటిని నోటితో వూది ఆర్పడం మాత్రం అంత శ్రేయస్కరం కాదని తాజా పరిశోధన చెబుతోంది. ముఖ్యంగా పిల్లలు ఇలా నోటితో ఊదే క్రమంలో వారి నోటి నుంచి ఎంతోకొంత లాలాజలం తుంపరగా కేకు మీద పడుతుంది. నోటినుండి విడుదలయ్యే లాలాజలంలో బ్యాక్టీరియా ఉంటుంది. కొవ్వొత్తిని ఊదినప్పుడు లాలాజలంలో ఉండే తుంపరలలోని బ్యాక్టీరియా కేకుపైన అలంకరించే ఐసింగ్ పొరపై పడగానే విపరీతంగా పెరిగిపోతుందని దక్షిణ కరోలినాలోని క్లెమ్సన్ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. ఆ బ్యాక్టీరియా ఐసింగ్ మీద పడగానే 14 రేట్ల మేరకు పెరుగుతుందట. దీనివల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. అందుకే పుట్టినరోజున కొవ్వొత్తులు ఊదే కార్యక్రమానికి స్వస్తిచెబితే మంచిది.

703
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles