బత్తాయితో కూడా!


Mon,September 10, 2018 11:22 PM

battai
-బత్తాయి తొక్కలను ఎండబెట్టి పొడి చేయాలి. పొడిలో తేనె, పసుపు వేసి బాగా కలుపాలి. శుభ్రంగా ఉన్న ముఖానికి ఈ మిశ్రమాన్ని రాసి పది నిమిషాల తరువాత నీటితో కడిగేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేయడం వల్ల చర్మంపై ఉన్న ట్యాన్‌ను తొలగించవచ్చు.
-బత్తాయిని సగానికి కోసి ఒక భాగంతో ముఖాన్ని 10 నిమిషాల పాటు రుద్దాలి. తరువాత సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. తడి ఆరిన తరవాత మాయిశ్చరైజర్‌ను రాసుకోవాలి. తరుచూ ఇలా చేయడం వల్ల మలినాలను తొలిగించుకొని చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
-బత్తాయి రసం, అరటి గుజ్జు, కీరదోస రసం, ఇ-విటమిన్ ఆయిల్‌ను వేసి బాగా కలుపాలి. ఈ మిశ్రామాన్ని ముఖం, మెడపై రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత నీటితో శుభ్రపరుచుకోవాలి. ప్రతిరోజూ ఇలా చేయడం వల్ల కంటికింద నల్లమచ్చలను తొలిగించవచ్చు.
-బత్తాయిలో విటమిన్లు, చాలా పోషకాలున్నాయి. శరీరం నుంచి విషాన్ని బయటకు పంపడానికి ఇది బాగా సహాయపడుతుంది.

548
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles