బండిపై బయలుదేరాడు


Fri,March 8, 2019 12:06 AM

కేరళ నుంచి నేపాల్‌కు
ప్రయాణం జ్ఞాపకాన్నిస్తుంది.. ప్రయాణం అనుభూతులనిస్తుంది ప్రయాణం జీవితాన్ని నేర్పుతుంది.. ప్రయాణం పాఠాల్ని చెబుతుంది ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రయాణం మొదలుపెట్టాడు సాజిన్ సతీషన్. 53 రోజుల్లో 12 వేల కిలోమీటర్లు ప్రయాణించిన ఓ యువ సంచారి పరిచయమిది..మన లక్ష్యం ప్రయాణం అయితే వాహనం అనేది సమస్యే కాదు. లక్ష్యం ఉంటే గమ్యం కూడా ఒక అడుగు వెనక్కి వేసి మన దగ్గరికి రావాలని చూస్తుంది. కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి స్కూటర్ రైడ్ చేసిన సాజిన్ సతీష్, ఈ ప్రయాణం ద్వారా చాలా నేర్చుకున్నాడు. చిన్న వయసులో ధైర్యంగా సోలో రైడ్ చేసి తనలోని సృజనాత్మకతను వెలికి తీశాడు.

Ejnfotorr
కాదు అనుకుంటే ఎప్పటికీ కాకుండా ఉంటుంది. అవుతుందని అడుగు ముందుకు వేస్తే కదా.. అవుతుందా కాదా అనేది తెలిసేది. కేరళ నుంచి కర్ణాటకలోని హంపీకి ఇంతకు ముందుకు బైక్ రైడ్ చేసిన అనుభవం ఉన్నది. ఆ ధైర్యంతో పెద్ద ట్రిప్ ప్లాన్ చేసుకున్నాడు. కేరళ అలప్పీకి చెందిన 23 ఏండ్ల సాజిన్ సతీషన్ కొచ్చిన్‌లోని రీఫైనరీస్ లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగం చేసి మానేశాడు. తన లక్ష్యం ప్రయాణం చేయడం. కేరళ నుంచి ప్రారంభించిన తన ప్రయాణం లే మీదుగా నేపాల్ వరకు సాగింది. తన స్కూటర్‌పైన ఒంటరిగా 53రోజుల్లో 12వేల కిలోమీటర్ల ప్రయాణం పూర్తి చేశాడు. హోటల్ మేనేజ్‌మెంట్‌లో గ్రాడ్యుయేషన్ చేసిన సతీష్ సంవత్సరం ఆరు నెలల పాటు పనిచేశాడు. ఉద్యోగం చేస్తున్నప్పుడు కొంత సంఘర్షణ పడ్డాడు. సంతృప్తిలేని ఉద్యోగాన్ని వదిలి తనకిష్టమైన ప్రయాణం చేయడానికి బయలుదేరాడు.

2015 నుంచే ప్రయాణాలు చేయడం ప్రారంభించిన సతీష్.. సోలో రైడ్స్, గ్రూప్స్ రైడ్స్ చాలా చేశాడు. కేరళలోని చాలా ప్రదేశాలకు వెళ్లాడు. రోజువారీ బిజీ జీవితం, రోజుకు ఎనిమిది గంటల ఉద్యోగం నచ్చక ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నాడు. మురుదేశ్వర్, గోకర్ణ, గోవా, మహాబలేశ్వర్, ముంబై, మధ్యప్రదేశ్, జైపూర్, ఢిల్లీ, చండీగఢ్, హిమాచల్, లే, శ్రీనగర్, ఢిల్లీ, ఆగ్రా, గోరఖ్‌పూర్‌ల మీదుగా నేపాల్ చేరుకున్నాడు. ఈ ప్రయాణంలో ఎన్నో అందమైన, అద్భుతమైన ప్రదేశాలను చూశాడు. ఈ మొత్తం ప్రయాణానికి 75 నుంచి 80 వేల రూపాయలు ఖర్చు అయింది. ఉద్యోగం చేస్తున్నప్పుడు దాచుకున్న డబ్బుల్ని ఈ ప్రయాణానికి ఖర్చు చేశానని చెప్తున్నాడు సతీష్. బండికి పోర్టబుల్ ఛార్జర్ బిగించి పక్కా ప్రణాళిక ప్రకారం ప్రయాణించాడు. ఉదయం లేచి ప్రయాణానికి ముందు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు. మధ్యాహ్నానికి భోజనం, రాత్రికి బస అన్నీ ముందే ప్లాన్ చేసుకునేవాడు. ముఖ్యంగా రాత్రిపూట తక్కువ ప్రయాణం చేశాడు. ఈ ప్రయాణం తనకు చాలా నేర్పిందంటున్నాడు.
Ejnfotorr1

633
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles