ఫ్యాషన్ దుస్తులను అద్దెకు ఇస్తామంటున్న శ్రేయామిశ్రా


Mon,February 25, 2019 01:44 AM

ఫ్యాషన్ రోజుకో రూపాన్ని సొంతం చేసుకుంటుంది. నిన్నటి ఫ్యాషన్ నేడు ఓల్డ్ అవుతోంది.ప్రతి ఒక్కరు రోజుకో రకమైన దుస్తులను ధరించాలనుకుంటారు. పెళ్లిళ్లకు ఒకరకమైన దుస్తులు, పార్టీలకు మరో రకమైన దుస్తులు. ఇలాంటి ట్రెండ్ పెరిగిపోతోంది. ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్.. ఏ చీర కట్టుకోవాలి.. ఏ లెహెంగా వేసుకోవాలి.. ఏ డ్రెస్ వేసుకోవాలి అని అందరూ తెగ జుట్టు పీక్కుంటూ ఉంటారు. ఒక్కరోజు కోసం వేల రూపాయలు పోసి దుస్తులు కొనుగోలు చేసేకంటే.. అద్దెకు తెచ్చుకుంటే.. అనే ఆలోచన నుండి పుట్టిందే ైఫ్లెరోబ్. అవసరమైన వారికోసం ఫ్యాషన్ దుస్తులను తక్కువ ధరకే అందజేస్తోంది ైఫ్లెరోబ్. పార్టీలకే కాదు సంప్రదాయ దుస్తులనూ రెంట్‌కు ఇస్తున్నది. అందరికీ నచ్చేలా మంచి క్వాలిటీ ఫ్యాషన్ దుస్తులను అద్దెకు ఇస్తామంటున్న ైఫ్లెరోబ్ సహ వ్యవస్థాపకురాలు శ్రేయామిశ్రా సక్సెస్‌మంత్ర.
Shreya-Mishra
వీకెండ్ పార్టీ, పెళ్లి లేదా స్నేహితులతో ఔటింగ్ వెళ్లాలనుకుంటే రొటిన్ దుస్తులే కనిపిస్తుంటాయి. అప్పటి కప్పుడు కొత్త డ్రెస్ అంటే సమయమూ ఉండదు. అయితే సందర్భం ఏదైనా కానీ కొత్త దుస్తులు కావాలంటే ైప్లెరోబ్ ఉందంటున్నారు శ్రేయా. ైఫ్లెరోబ్ ఆన్‌లైన్ ఫ్యాషన్ పోర్టల్ ద్వారా సేవలందిస్తున్నది. బాంబే ఐఐటీలో గ్రాడ్యుయేట్స్ అయిన తన స్నేహితులు ప్రణయ్ సురానా, తుషార్ సక్సేనాలతో కలసి ఆమె ైఫ్లెరోబ్‌ను ఏర్పాటు చేశారు.

స్ఫూర్తి నిచ్చిన బీఎన్‌బీ అది 2012. శ్రేయ స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ చదువుతున్నారు. సమ్మిట్‌లో భాగంగా ట్రైనింగ్ కోసం ఎయిర్ బీఎన్‌బీ కార్యాలయాన్ని విజిట్ చేశారు. ఆ సమయంలోనే ఫ్యాషన్ దుస్తులను అద్దెకు ఇవ్వాలన్న ఆలోచన శ్రేయకు వచ్చింది. నిత్యం మనకు అవసరమున్నప్పటికీ, కొనుక్కోవాల్సిన అవసరం లేనివి ఏంటీ అన్న అంశంపై మేం ముగ్గురం చర్చించాం. గంట ఫంక్షన్‌కు వెళ్లడానికి లేదా పార్టీలో వినియోగానికి కొనుగోలు చేయాల్సిన అవసరం ఎందుకు అన్నప్పుడు మా మదిలో ఈ ఫ్యాషన్ దుస్తుల ఐడియా వచ్చింది. అలా ఆన్‌లైన్ వార్డ్‌రోబ్ ప్రారంభించాం అని శ్రేయ వివరించారు. అంతేకాదు కావాలనుకున్నప్పుడు తమకు నచ్చిన దుస్తులను కొనుగోలు చేయకుండానే వాడుకోవచ్చు కదా అన్న ఆలోచనతో 200 మందితో సర్వే నిర్వహించారు. అందులో 80% మంది పాజిటివ్‌గా స్పందించారు.
shreya1

ఫ్యాషన్ ప్రియులకు పండగే

ప్రముఖ డిజైనర్లు రూపొందించిన అన్ని రకాల దుస్తులు ైఫ్లెరోబ్‌లో అందుబాటులో ఉంటాయి. ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్‌ను అందుబాటులో పెట్టే ైఫ్లెరోబ్‌కు ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. మాములుగా డిజైనర్లు రూపొందించిన ఫ్యాషన్ దుస్తులు కొనాలంటే వస్ర్తాల ప్రారంభ ధర రూ. 20,000 పైమాటే. ఈ ధరలో 10-15 శాతం రెంట్‌గా కట్టగలిగితే నాలుగు రోజులు మీరు ఫ్యాషన్ ఐకాన్‌గా మెరిసిపోవచ్చు. అంతేకాదు ఫ్రీగా ఫ్యాషన్ కన్సల్టెంట్లు మీకు సలహాలు సూచనలు ఇచ్చేందుకు ఎప్పుడూ రెడీగా ఉంటారు. సెలబ్రిటీలు చాలా మంది ఇలాంటి కాన్సెప్ట్ ద్వారానే సరికొత్త ట్రెండ్లను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటున్నారు.

సేవలు ఇలా..

కస్టమర్ల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని వెస్ట్రన్ దుస్తులను మూడు గంటల్లో హోం డెలివరీ చేస్తుంది ైఫ్లెరోబ్. సంప్రదాయ దుస్తులైతే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సంస్థకు మార్కెటింగును కూడా వినూత్నంగా చేపట్టారు ైప్లెరోబ్ నిర్వాహకులు. ఏంజెల్ యూజర్ క్యాంపెయిన్ పేరుతో ప్రచా రాన్ని నిర్వహించారు. లాయర్ నుంచి డాక్టర్, కాలేజీ స్టూడెంట్ ఇలా విభిన్న రంగాలకు చెందిన 10 మంది మహిళలను ఎంపిక చేసి, ైప్లెరోబ్ ఔట్‌ఫిట్స్‌తో ఫొటోషూట్ నిర్వహించారు. వాటిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసి రివ్యూలు తీసుకున్నారు. ఇలాంటి ప్రచారంతో తొలివారంలోనే 35 మంది కస్టమర్లు వచ్చారు. ఈ ప్రచారం బాగుందనిపించింది. వీటితోపాటు స్నేహితుల రెకమండేషన్స్‌తో చాలామంది దుస్తులను అద్దెకు తీసుకునేందుకు ముందుకు వచ్చారు. ఇప్పటివరకు 75 వేల మందికి పైగా తమ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారని ైప్లెరోబ్ నిర్వాహకులు అంటున్నారు. ప్లే స్టోర్‌లో ఈ యాప్‌కు 4.3 రేటింగ్ ఇచ్చారు కస్టమర్లు. దుస్తుల ధరలో 10 నుంచి 15 % ధరకే అద్దెకు ఇస్తున్నారు. రానున్నకాలంలో ప్రతి మహిళా ఆన్‌లైన్ వార్డ్‌రోబో మెంబర్ కావాలన్నదే మా లక్ష్యం అని శ్రేయ చెప్పారు.

అద్దె ఎలా?

నాలుగు రోజుల డ్రెస్ అద్దె 1500 రూపాయలతో మొదలవుతుంది. కలెక్షనును బట్టి ైఫ్లెరోబ్ అద్దెను చార్జ్ చేస్తుంది. పెళ్లికుమారుడు, పెళ్లి కుమార్తె, వివాహానికి హాజరయ్యే అన్ని వయసుల్లోని అతిథులకు తగ్గ వస్ర్తాలు ఇందులో ఉంటాయి. అమ్మాయిలు, అబ్బాయిలు, స్త్రీ, పురుషులు వారి చాయిస్, టేస్ట్‌కు తగ్గట్టుగా ఇందులో వస్ర్తాలు ఉంటాయి. మీరు కావాలంటే స్టోర్‌కు డైరెక్ట్‌గా వెళ్లి, వాటిని ట్రై చేశాకే అద్దెకు తీసుకునే వెసులుబాటు కూడా ఉంది. ఢిల్లీ, బెంగళూరు, ముంబై, హైదరాబాదు, పూనే, కోల్‌కతాలో ఈ స్టోర్స్ ఉన్నాయి. పార్టీ, గ్లామర్, వెడ్డింగ్, మెన్, వుమెన్ కేటగిరీల్లో వేలాది డిజైన్స్ మీకోసం రెడీగా ఉంటాయి. అంతేకాదు ఫ్రీ హోం డెలివరీతోపాటు, ఫ్రీ పికప్ కూడా ఉంటుంది.

భవిష్యత్ అద్దె దుస్తులదే..

వేలకొద్ది డబ్బులు పెట్టి వస్తువులు కొనుక్కునే రోజులు పోయాయి. చాలామంది ఇప్పుడు యూజ్ అండ్ త్రోకే ప్రాధాన్యమిస్తున్నారు. పెద్ద మొత్తంలో దుస్తుల కోసం డబ్బులు పెట్టాల్సిన అవసరం లేకుండా, కొద్దిమొత్తంతోనే అద్దెకు తీసుకునే సౌకర్యం లభిస్తుండటంతో చాలామంది వీటిపై ఆసక్తి చూపిస్తున్నారు. మరోవైపు ఇండియాలో సెకండ్ హ్యాం డ్ టెక్స్‌టైల్ మార్కెట్ ఎప్పుడూ ఉంటుంది. యూఎన్ కాం ట్రేడ్ 2013 డాటా ప్రకారం182 మిలియన్ డాలర్ల విలువ చేసే వాడేసిన దుస్తులను ఇండియా దిగుమతి చేసుకుంది. ఈ దిగుమతి రంగంలో ఇండియానే అగ్రస్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ రెంటల్ వార్డ్‌రోబ్ ైఫ్లెరోబ్ మరింత విజయవంతం అవుతుందనడంలో సందేహం లేదు.
Flyrobe

కార్యరూపమిచ్చి

తమకు వచ్చిన ఐడియాను కార్యరూపంలో పెట్టారు శ్రేయ. మొదట బీటా వెర్షన్ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తరువాత యాండ్రాయిడ్ యాప్‌ను లాంచ్ చేశారు. రెండు విజయవంతం కావడంతో అధికారికంగా వెబ్‌సైట్‌ను పారంభించారు. ైఫ్లెరోబ్‌లో ప్రస్తుతం 40 మంది ఇంజినీరింగ్, మార్కెటింగ్, బిజినెస్ డెవలమ్‌మెంట్, ప్రొడక్ట్, ఆపరేషన్ ఉద్యోగులున్నారు. బాసిన్ అండ్ కో, ఇన్మొబీ, క్యాడబరీ, టిన్యోల్ వంటి పెద్ద పెద్ద కంపెనీలను వదులుకుని వీరి కంపెనీలో చేరిన
వారున్నారు.

1122
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles