ఫ్యాషన్‌లో బిలియనీర్!


Wed,February 13, 2019 12:38 AM

అందరూ ఫ్యాషన్‌ను ఫాలో అవుతుంటే.. ఆ ఫ్యాషన్‌తో బిలియన్ల కొద్ది డాలర్లు సంపాదిస్తున్నది ఓ యువతి. అందరిలాగే ఆమె కూడా ఓ ఫ్యాషన్ ప్రియురాలిగానే కెరీర్ స్టార్ట్ చేసినా అభిరుచి ఆమెను స్టార్టప్ వైపు నడిపించింది.
Ankiti-Bose
బెంగళూరుకు చెందిన 27 ఏళ్ల వయసు అంకితి బోస్ ఇప్పుడు ఫ్యాషన్ రంగంలో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నది. అనతికాలంలోనే బిలియనీర్‌గా మారి ఫ్యాషన్ ఎర్నింగ్‌లో తనదైన ముద్రవేసింది. ఫ్యాషన్‌లో సరికొత్త ఉత్పత్తులను తీసుకొచ్చేందుకు ఆమె జిలింగో స్టార్టప్‌ను ప్రారంభించింది. ఏదో సరదా కోసం ధ్రువ్‌కపూర్ అనే యువకుడి స్టూడియోకు వెళ్లి రకరకాల మోడల్స్ చూస్తుండేది తొలుత. రానురాను తన ఆలోచనలు ఫ్యాషన్‌కు దగ్గరగా ఉండటంతో అతనితో కలిసి జిలింగో స్టార్ట్ చేశారు. కొద్దిరోజుల్లోనే సౌత్‌ఈస్ట్ ఏసియాలో తమకంటూ ఓ మంచి బ్రాండ్‌ను ఏర్పరచుకున్నారు. తర్వాత 293 కాపిటల్ వెంచర్‌ను లాంచ్ చేశారు. దానికి అంకితి సీఈఓ. ఇప్పుడు ఆ స్టార్టప్ విలువ బిలియన్ డాలర్లు. మహిళా సీఈఓలుగా ఉన్న ప్రపంచంలోని ఏ స్టార్టప్ కూడా ఇంత తక్కువ కాలంలో బిలియన్ విలువ చేసేలా తీర్చిదిద్దిన దాఖలాలు లేకపోవడంతో ఫ్యాషన్ దునియా ఆమెను చూసి ముక్కున వేలేసుకుంటున్నది.

344
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles