ఫ్యాట్ టు ఫిట్ -16


Sat,June 7, 2014 12:21 AM

బుసకొట్టే పామును పోలి ఉంటుంది కాబట్టే సర్పాసనానికి ఆ పేరు వచ్చింది. మనం పైకి లేచినప్పుడు నడుము మీద ఒత్తిడి పెరుగుతుంది. కటి అంటే నడుము అని అర్థం. నడుముకు చక్కని వ్యాయామమిచ్చేదే కటి చక్రాసనం. ఈ రెండు ఆసనాలు కూడా నడుమును మంచి ఆకతిలో ఉంచేందుకు తోడ్పడతాయి. ఆ ఆసనాలే ఈ వారం యోగాలో..

సర్పాసనం
yoga1ముందుగా బోర్లా పడుకోవాలి. చేతులు రెండు ఛాతి పక్కగా పెట్టాలి. రెండు పాదాలను కాలి వేళ్లమీద ఉంచాలి. ఇప్పుడు గాలి పీలుస్తూ నెమ్మదిగా శరీరాన్ని పైకి లేపాలి. అరచేతులు, కాలివేళ్ల మీద మాత్రమే శరీర బరువును బ్యాలెన్స్ చేయాలి. ఇలా వీలుకానివారు మోకాళ్లను భూమి మీద ఆన్చి ఉంచవచ్చు. ఇప్పుడు గాలి వదులుతూ తలను కుడివైపుగా వెనక్కి తిప్పి కాలి మడమలను చూసే ప్రయత్నం చేయాలి. మళ్లీ గాలిపీల్చుతూ తలను ముందుకు తిప్పాలి. మళ్లీ గాలి వదులుతూ ఎడమవైపు తలని తిప్పి మడమలను చూసే ప్రయత్నం చేయాలి. ఇలా కుడివైపు, ఎడమవైపు పదిసార్లు రిపీట్ చేయాలి.

ఉపయోగాలు :

-ఆస్త్మా ఉన్నవారికి చాలా మంచిది.
-ఊపిరితిత్తులను పూర్తిగా ఉపయోగించడంలో సహకరిస్తుంది.
-గుండె కండరాలు, వెన్నెముక కండరాలు బలపడతాయి.

జాగ్రత్తలు :

-హైబీపీ, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు జాగ్రత్తగా చేయాలి.
-హెర్నియా, అల్సర్ ఉన్నవాళ్లు చేయకూడదు.

కటి చక్రాసనం
yoga2రెండుపాదాలు దగ్గరగా ఉంచి నిటారుగా నిల్చోవాలి. రెండు పాదాలను ఒక్కటిన్నర అడుగు దూరంగా ఉంచి రెండు చేతులను ముందుకు చాచాలి. చేతులు ఒకదానికొకటి సమాంతరంగా ఉండాలి. ఇప్పుడు గాలి దీర్ఘంగా పీల్చుకొని గాలి వదులుతూ కుడిపక్కగా వీలున్నంతవరకూ తిరగాలి. పాదాలను కదల్చకూడదు. నడుము వరకు మాత్రమే తిరగాలన్నమాట. వెనక్కి తిరిగినప్పుడు కూడా చేతులు ఒక్కదానికొకటి సమాంతరంగానే ఉంచాలి. నాలుగు నుంచి 6 సెకన్ల పాటు ఆగి గాలి పీల్చుకుంటూ ముందుకు తిరగాలి. ఇలా ఒకసారి కుడిపక్కగా మరోసారి ఎడమ పక్కకు మొత్తం 10సార్లు చేయాలి.

ఉపయోగాలు :

-శరీర ఊర్ధ్వ భాగానికిది మంచి వ్యాయామం.
-నడుము దగ్గర కొవ్వును కరిగిస్తుంది.
-ఆర్థ్రరైటిస్ ఉన్నవారికి చాలా మంచిది.

జాగ్రత్తలు :

-స్పాండిలైటిస్ ఉన్నవారు మెడ కొంచెం నెమ్మదిగా తిప్పాలి.

గమనిక

-యోగాకి ముందు వార్మప్ ఎక్సర్‌సైజెస్ (సూక్ష్మ వ్యాయామాలు) తప్పనిసరిగా చేయాలి.

6381
Tags

More News

VIRAL NEWS