ఫోన్ మరువకుండా..


Tue,December 18, 2018 11:04 PM

స్లయిల్ ఐకాన్‌గా ఉండాలనుకునే వాళ్లు.. ఎక్కువగా జాకెట్‌లను ఎంచుకుంటారు. ఇప్పుడది స్మార్ట్ జాకెట్‌గా కూడా మారిపోయింది. కాకపోతే ఇది చాలా కాస్ట్‌లీ గురూ!
smart
ఫోన్‌ని ఒక చోట పెట్టి.. మరో చోట వెతుక్కోవడం చాలామంది చేసే పని. ఒక్కోసారి బయటకు వెళుతూ ఫోన్ తీసుకుపోరు. అలాంటి పరిస్థితి రాకుండా ఈ స్మార్ట్ జాకెట్ ఫోన్ ఇక్కడుంది? తీసుకుపొమ్మని గుర్తు చేస్తుంది. గూగుల్ ఎప్పటి నుంచో వేరెబుల్ టెక్నాలజీ మీద రీసెర్చ్ చేస్తున్నది. రోజువారి స్థితిలో టెక్నాలజీ ఉపయోగించేలా మరింత పెరుగాలని ఈ పరిశోధన చేస్తున్నారు. అయితే జాక్వర్ట్ స్మార్ట్ జాకెట్, లివిస్‌తో కలిపి ఒక జీన్స్ జాకెట్‌ని తయారు చేస్తున్నది. ఇదొక స్మార్ట్ జాకెట్. ఈ జాకెట్, ఫోన్ దగ్గరకు వచ్చినప్పుడల్లా ఒక వైబ్రేషన్ జాకెట్‌లో కలుగుతుంటుంది. అంటే.. దగ్గరలోనే ఆ ఫోన్ ఉన్నట్లు గుర్తుచేస్తుందన్నమాట. అలాగే ఆ జాకెట్‌లో ఫోన్ లేకపోయినా వెంటనే వైబ్రేషన్ వస్తుంది. పైగా చేతికి ఉండే బటన్ ఫోన్ ఆన్సర్ చేయడానికి, ప్లే లిస్ట్‌ని వినిపించడానికి ఒక రిమోట్ కంట్రోల్‌గా కూడా పనిచేస్తుంది. త్వరలోనే దీన్ని మార్కెట్‌లోకి విడుదల చేయనున్నారు. ఇన్ని పనులు చేస్తుంది కాబట్టి.. ఈ జాకెట్ ధర కూడా ఎక్కువేనండోయ్. సుమారు 25, 400 రూపాయల ధర పలుకొచ్చునని అంచనా.

496
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles