సరిగ్గా భోజన సమయం.. లోపల ఆకలి.నకనకలాడుతుంది. కిచెన్‌లో ఆమె గరిట తిరిగేస్తుంది. పప్పు, రోటి, రసం వాటిపై కొద్దిగా ఉప్పు చల్లి పక్కన పెడుతుంది. వాటితో పాటు ఆ పూటకు స్పెషల్‌గా తయారు చేసిన భోజనాన్ని సర్దిపెడుతుంది. కానీ ఇదంతా ఎవరికోసం చేస్తుందామె? ఇంట్లో వాళ్ల కోసం మాత్రం కాదు.

ఫైవ్‌స్టార్ హోటల్స్‌లో ఎలాంటి భోజనం ఉంటుంది. ఫేమస్ చెఫ్‌లతో దేశవిదేశాలకు చెందిన భోజనం ఉంటుంది. కాస్త డబ్బున్న వాళ్లు తరచూ అలాంటి ఆహారాన్ని ఇష్టపడతారు. కానీ ఓ ఫైవ్ స్టార్ హోటల్లో ఓ ఇంటి మహిళ చేసే వంట ఆ హోటల్ కస్టమర్లకు తెగ నచ్చేసున్నది. ఎక్కడో తెలుసా బెంగళూర్‌లో తాజ్ హోటల్లో. జ్యోతి అనే సాధారణ మహిల తాజ్హోటల్లో చెఫ్‌గా పని చేస్తున్నది. ఆమె చేసె రోటి, రసం, పప్పు భోజనం అచ్చంగా ఇంటి వంటలాగే ఉంటాయి. ఇంకేంముంది దీంతో అక్కడి కస్టమర్లు ఆమె చేసిన ఆహారాన్ని చాలా ఇష్టంగా తీసుకుంటున్నారు. అయితే ఇంత సాధారణ మహిళ అంత పెద్ద హోటల్లో చెఫ్ ఎలా అయింది అనేగా మీ సందేహం.. అయితే జ్యోతి భర్త ఓ పెండ్లి క్యాటరర్.. చాలా రోజులు ఇలా పెండ్లి భోజనాల వడ్డనకు, తయారికి వంట మనిషిగా, పని మనిషిగా వెళ్లి డబ్బులు సంపాదించేవాడు. ఆయనతో పాటే జ్యోతి కూడా వెళ్లేది. అలా వెళ్లిన ఆమె ఆయనకు అక్కడ పెండ్లివంట చేయటంలో సాయం చేసేది. ఇలా ఓ రోజు ఆమె చేసిన వంటను చాలా మంది అభినందించారు. దీంతో ఆమె పెండిళ్లల్లో చెఫ్‌గా మారింది. తర్వాత కొద్ది రోజులకు తెలిసిన వ్యక్తి ఆమెను తాజ్ హోటల్లో ఇలాంటి వంట చేయాలని కోరాడు. అలా తాజ్‌హోటల్‌కు వెళ్లిన జ్యోతి ఆమె వంట మహత్యంతో అందరినీ ఆశ్చర్యపరిచింది. కస్టమర్లకు సైతం ఆమె వంట విపరీతంగా నచ్చటంతో ఆమె అక్కడే చెఫ్‌గా స్థిరపడింది. దీని కోసం ఆమె ఎలాంటి శిక్షణా తీసుకోలేదు. మొదట్లో కొంచెం ఇబ్బందిగా ఉన్నా వంట చేయటం మీద ఆమెకు ఉన్న అభిరుచి మూలంగా అన్నీ అధిమించినట్టు చెబుతున్నది.