ఫైబ్రాయిడ్స్‌కు హోమియో బెస్ట్


Wed,May 3, 2017 12:11 AM

Homeopathic యూటిరైన్ ఫైబ్రాయిడ్స్ సాధారణంగా గర్భాశయ కండర కణజాలంలో ఏర్పడుతాయి. ఈ కణతులు ఒకటి గాని లేదా చిన్నచిన్న కణతులు గుంపులుగాను ఏర్పడవచ్చు. వీటి పరిమాణం మిల్లీమీటరు నుంచి మొదలుకొని కొన్ని సెంటీమీటర్ల పెరుగుతాయి. ఉదాహరణకి ఒక పెద్ద ఫైబ్రాయిడ్, 6 -7 నెలల గర్భం మాదిరిగా ఉంటుంది.
రకాలు - గర్భాశయంలో ఫైబ్రాయిడ్ పెరిగే స్థానాన్ని బట్టి ఇవి మూడు రకాలు
-ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ - యూటిరైన్ ఫైబ్రాయిడ్స్‌తో బాధపడే స్త్రీలలో 70 శాతం ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్‌తో బాధపడుతుంటారు. ఇవి చాలా సాధారణమైనవి. ముఖ్యంగా గర్భాశయ గోడల మధ్యలో ఏర్పడుతాయి. కొన్ని సందర్భాలలో ఈ వైపుగా పెరిగితే సబ్ సీరోసల్ ఫైబ్రాయిడ్స్‌గా మారుతాయి. సాధారణంగా ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ వల్ల ఎటువంటి లక్షణాలు కనబడవు. కేవలం 3 శాతం స్త్రీలలో మాత్రమే సంతాన లేమి సమస్యలకు దారి తీస్తుంది.
-సబ్ సీరోసల్ ఫైబ్రాయిడ్స్ - ఇవి సాధారణంగా 20 శాతం స్త్రీలలో మాత్రమే గమనించవచ్చు. ఈ కణతులు ముఖ్యంగా గర్భాశయం వెలుపల ఉండే గోడలపైన ఏర్పడుతాయి. కొన్ని సందర్భాలలో ఇవి కాడను కలిగి గర్భాశయానికి అంటుకొని ఏర్పడుతాయి. వీటినే పెడంకులేటెడ్ ఫైబ్రాయిడ్స్ అంటారు. ఎప్పుడైతే ఈ పెడంకులేటెడ్ ఫైబ్రాయిడ్స్ మెలి తిరిగినపుడు విపరీతమైన నొప్పి వస్తుంది.
-సబ్‌మ్యూకోసల్ ఫైబ్రాయిడ్స్ - ఇవి చాలా అరుదుగా కేవలం 5 శాతం స్త్రీలలో మాత్రమే గమనించవచ్చు ఈ కణతులు ముఖ్యంగా గర్భాశయం లోపల ఉండే మ్యూకోసల్ పొర కింద ఏర్పడుతాయి. వీటిలో కూడా పెడంకులేటెడ్ ఫైబ్రాయిడ్స్ వచ్చే అవకాశం ఉంది.

కారణాలు


చిన్న వయసులోనే నెలసరి ప్రారంభం కావడం. హార్మోన్ల అసమతుల్యత. ముఖ్యంగా ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల ఫైబ్రాయిడ్స్ వచ్చే అవకాశం ఉంది. అందుకే మెనోపాజ్ మొదలైన మహిళల్లో హార్మోన్లు తగ్గడం వల్ల ఫైబ్రాయిడ్స్ వచ్చే అవకాశం తక్కువ. స్థూలకాయం, సంతానలేమి, కుటుంబ నేపథ్యం వంటి కారణాల వల్ల గర్భాశయంలో కణతులు ఏర్పడే అవకాశం ఉంది.
-లక్షణాలు - అధిక రక్తస్రావం, ఎక్కువ రోజుల పాటు కొనసాగడం. తీవ్రమైన కడుపునొప్పి, నడుము నొప్పి, కాళ్లలో నొప్పి వంటి లక్షణాలు గమనించవచ్చు. ఫైబ్రాయిడ్స్ వల్ల మూత్రాశయం మీద ఒత్తిడి పెరిగి తరచూ మూత్రవిసర్జన చెయ్యాల్సి రావచ్చు. ఫైబ్రాయిడ్స్ మీద ఒత్తిడి పెరుగడం వల్ల మలబద్ధకం కడుపు ఉబ్బరం వంటి లక్షణాలు చూడవచ్చు. అధిక రక్తస్రావం జరగడం వల్ల రక్తహీనత వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
-నిర్ధారణ - వ్యాధి లక్షణాల ఆధారంగా పెల్విక్ ఎక్జామినేషన్, అల్ట్రాసౌండ్, ట్రాన్స్ వెజయినల్ స్కాన్, రక్తపరీక్ష, ఎంఆర్‌ఐ, బయాప్సీ, హిస్టరోస్కోపి, హిస్టరోసాల్ఫిం గోగ్రఫీ, లాప్రోస్కోపి వంటి పరీక్షల ద్వారా వ్యాధి నిర్ధారణ చెయ్యవచ్చు.
-నివారణ - యూటిరైన్ ఫైబ్రాయిడ్స్‌కి ప్రత్యేకించి నివారణ మార్గాలు లేనప్పటికీ ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల ఈ వ్యాధి తక్కువగా వచ్చే అవకాశం ఉంది.

srikanth

హోమియో చికిత్స


హోమియో కేర్ ఇంటర్నేషనల్‌లో జెనెటిక్ కాన్స్‌టిట్యూషనల్ సిమిలియం ద్వారా గర్భాశయ కణతులను కరిగించడమే కాకుండా హార్మోన్ల అసమతుల్యతను, రుతుచక్ర సమస్యలను సరిచేసి చికిత్స ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా శస్త్ర చికిత్స చేసి గర్భాన్ని తొలగించే పని లేకుండా కేవలం మందుల ద్వారా ఈ వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు.

473
Tags

More News

VIRAL NEWS

Featured Articles