ఫైబ్రాయిడ్స్‌కు హోమియో బెస్ట్


Wed,September 21, 2016 03:55 AM

యూటిరైన్ ఫైబ్రాయిడ్స్ సాధారణంగా గర్భాశయ కండర కణజాలంలో ఏర్పడుతాయి. ఈ కణితులు ఒకటి గాని లేదా చిన్నచిన్న కణితులు గుంపులుగానను ఏర్పడవచ్చు. వీటి పరిమాణం మిల్లీమీటరు నుంచి మొదలుకొని కొన్ని సెంటీమీటర్ల పరిమాణం వరకు పెరుగుతాయి. ఉదాహరణకి ఒక పెద్ద ఫైబ్రాయిడ్, 6 -7 నెలల గర్భం మాదిరిగా ఉంటుంది.
-రకాలు - గర్భాశయంలో ఫైబ్రాయిడ్ పెరిగే స్థానాన్ని బట్టి ఇవి మూడు రకాలు
-ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ - యూటిరైన్ ఫైబ్రాయిడ్స్‌తో బాధపడే స్త్రీలలో 70 శాతం ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్‌తో బాధపడుతుంటారు. ఇవి చాలా సాధారణమైనవి. ముఖ్యంగా గర్భాశయ గోడల మధ్యలో ఏర్పడతాయి. కొన్ని సందర్భాలలో ఈ కణితులు ఎండోమెట్రియం దిశగా గర్భాశయంలోపల వైపుగా పెరిగితే సబ్ సీరోసల్ ఫైబ్రాయిడ్స్‌గా మారుతాయి. సాధారణంగా ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ వల్ల ఎటువంటి లక్షణాలు కనబడవు. కేవలం 3 శాతం స్త్రీలలో మాత్రమే సంతాన లేమి సమస్యలకు దారి తీస్తుంది.
-సబ్ సీరోసల్ ఫైబ్రాయిడ్స్ - ఇవి సాధారణంగా 20 శాతం స్త్రీలలో మాత్రమే గమనించవచ్చు. ఈ కణితులు ముఖ్యంగా గర్భాశయం వెలుపల ఉండే గోడలపైన ఏర్పడతాయి. కొన్ని సందర్భాలలో ఇవి కాడను కలిగి గర్భాశయానికి అంటుకొని ఏర్పడతాయి. వీటినే పెడంకులేటెడ్ ఫైబ్రాయిడ్స్ అంటారు. ఎప్పుడైతే ఈ పెడంకులేటెడ్ ఫైబ్రాయిడ్స్ మెలి తిరిగినపుడు విపరీతమైన నొప్పి వస్తుంది.
-సబ్‌మ్యూకోసల్ ఫైబ్రాయిడ్స్ - ఇవి చాలా అరుదుగా కేవలం 5 శాతం స్త్రీలలో మాత్రమే గనమించవచ్చు ఈ కణితులు ముఖ్యంగా గర్భాశయం లోపల ఉండే మ్యూకోసల్ పొర కింద ఏర్పడతాయి. వీటిలో కూడా పెడంకులేటెడ్ ఫైబ్రాయిడ్స్ వచ్చే అవకాశం ఉంది.

కారణాలు
చిన్న వయసులోనే నెలసరులు ప్రారంభం కావడం. హార్మోన్ల అసమతుల్యత ముఖ్యంగా ఈస్ట్రోజన్ మరియు ప్రొజెస్టిరాన్ హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల ఫైబ్రాయిడ్స్ వచ్చే అవకాశం ఉంది. అందుకే మెనోపాజ్ మొదలైన మహిళల్లో హార్మోన్లు తగ్గడం వల్ల ఫైబ్రాయిడ్స్ వచ్చే అవకాశం తక్కువ. స్థూలకాయం, సంతానలేమి, కుటుంబ చరిత్ర వంటి కారణాల వల్ల గర్భాశయంలో కణితులు ఏర్పడే అవకాశం ఉంది.
-లక్షణాలు - అధిక రక్తస్రావం, ఎక్కువ రోజుల పాటు కొనసాగడం. తీవ్రమైన కడుపునొప్పి, నడుము నొప్పి, కాళ్లలో నొప్పి వంటి లక్షణాలు గమనించవచ్చు. ఫైబ్రాయిడ్స్ వల్ల మూత్రాశయం మీద ఒత్తిడి పెరిగి తరచూ మూత్ర విసర్జన చెయ్యాల్సి రావచ్చు. ఫైబ్రాయిడ్స్ మీద ఒత్తిడి పెరగడం వల్ల మలబద్ధకం కడుపుబ్బరం వంటి లక్షణాలు చూడవచ్చు. అధిక రక్తం స్రావం జరగడం వల్ల రక్తహీనత వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
-నిర్ధారణ - వ్యాధి లక్షణాల ఆధారంగా మరియు పెల్విక్ ఎక్జామినేషన్, అల్ట్రాసౌండ్, ట్రాన్స్ వెజయినల్ స్కాన్, రక్తపరీక్ష, ఎంఆర్‌ఐ, బయాప్సీ, హిస్టరోస్కోపి, హిస్టరోసాల్ఫిం గోగ్రఫీ, లాప్రోస్కోపి వంటి పరీక్షల ద్వారా వ్యాధి నిర్ధారణ చెయ్యవచ్చు.
-నివారణ - యూటిరైన్ ఫైబ్రాయిడ్స్‌కి ప్రత్యేకించి నివారణ మార్గాలు లేనప్పటికీ ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల ఈ వ్యాధి తక్కువగా వచ్చే అవకాశం ఉంది.
-హోమియోచికిత్స - హోమియోకేర్ ఇంటర్నేషనల్‌లో జెనెటిక్ కాన్స్‌టిట్యూషనల్ సిమిలియం ద్వారా గర్భాశయ కణితులను కరిగించడమే కాకుండా హార్మోన్ల అసమతుల్యతను, రుతుచక్ర సమస్యలను సరిచేసి చికిత్స ఇవ్వడం జరుగుతుంది. అంతే కాకుండా శస్త్ర చికిత్స చేసి గర్భాన్ని తొలగించే పని లేకుండా కేవలం మందుల ద్వారా ఈ వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు.

-మనం పడుకునే మంచంపై ఉండే దుమ్ములో చాలావరకు మన శరీరం నుంచి రాలిపడిన మృతకణాలే.
-చనిపోయిన తరువాత శరీరం కుళ్లిపోవడం మొదలవుతుంది కదా. దీనికి ప్రారంభం మన శరీరంలోనే. మనం తీసుకున్న ఆహారం జీర్ణం కావడానికి తోడ్పడే ఎంజైమ్‌లు.. మనం మరణించిన మూడు రోజులకు మనల్ని తినడం ప్రారంభిస్తాయి. అందుకే శరీరం కుళ్లడం మొదలవుతుంది. ఆ తరువాత బాక్టీరియా పాత్ర కూడా ఉంటుంది.
-మన జీర్ణవ్యవస్థ అంటే నోటి నుంచి మలద్వారం వరకు ఉండే పొడవు 30 అడుగులు.
-40ల వయసు చివరి వరకు కూడా మన మెదడు ఎదుగుతూనే ఉంటుంది. కొత్త విషయాలను అర్థం చేసుకోవడం, నేర్చుకోవడం వేగంగా జరగడానికి కారణం ఇదే.
srikanth

1418
Tags

More News

VIRAL NEWS

Featured Articles