ఫేస్‌బుక్‌లో కొత్త ఫీచర్


Wed,March 6, 2019 01:22 AM

ఈ మధ్య ఫేస్‌బుక్‌లో దొంగలు పడి మన వ్యక్తిగత సమాచారాన్నంతా దోచుకెళ్లిపోతున్నారు. అందుకే ఫేస్‌బుక్ టీమ్ తమ యూజర్ల కోసం కొత్త ఫీచర్‌ను తీసుకురాబోతున్నది. అదేంటంటే..
facebook
ఫేస్‌బుక్ ఖాతాదారులు తమ అకౌంట్‌లోకి లాగిన్ అయి ఏమేం చేశారో తెలుసుకునే అవకాశం మొన్నటి వరకు ఉండేది. దీంతో వ్యక్తిగత సమాచారం చోరీకి గురయ్యేది. ఫేస్‌బుక్ తేనున్న సరికొత్త ఫీచర్‌తో డేటా చోరీకి ఇక చెక్ పడనుంది. క్లియర్ హిస్టరీ పేరుతో ఫేస్‌బుక్‌లో ప్రవేశపెట్టనున్న కొత్త ఫీచర్‌తో ఆన్‌లైన్ డేటా చోరుల బెడద నుంచి వినియోగదారులను తప్పించేందుకు కృషి చేస్తున్నది ఫేస్‌బుక్ టీమ్. ఈ ఫీచర్ వల్ల ఫేస్‌బుక్ అకౌంట్‌లో బ్రౌజ్ చేసిన హిస్టరీ మొత్తం సులభంగా క్లియర్ చేసుకోవచ్చు. దీంతో యూజర్లు తమ ఫేస్‌బుక్ అకౌంట్లో ఏమేం చేశారో, ఏమేం చూశారో తెలుసుకునే అవకాశం హ్యాకర్లకు ఉండదు. వచ్చే నెలలోనే ఈ ఫీచర్‌ను ఫేస్‌బుక్ వినియోగదారులకు అందుబాటులోకి తేనున్నది.

718
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles