ఫుడ్ డెలీవరీ అక్క!


Fri,December 28, 2018 01:54 AM

స్విగ్గీ, జొమాటో, ఉబర్ వంటి కంపెనీల్లో ఫుడ్ డెలీవరి చేసేవాళ్లను డెలీవరి బాయ్స్ అంటాం. మరి ఫుడ్ డెలీవరి చేసే మహిళల్ని?
jayalakmi
ఫుడ్ డెలీవరీ చేసే మహిళలు కూడా ఉన్నారా? ఉన్నారు. స్విగ్గీ సంస్థ ప్రయోగాత్మకంగా చెన్నైలో జయలక్ష్మి అనే మహిళకు ఉపాధి కల్పించింది. మొదటి ఫుడ్ డెలీవరీ మహిళగా జయలక్ష్మి ఉద్యోగం సాధించి ఆహారాన్ని అందిస్తున్నది. ఇప్పుడామెను ఫుడ్ డెలీవరీ అక్క అంటున్నరు. నలభై యేండ్ల జయలక్ష్మికి ఇంతకుముందు గూగుల్ మ్యాప్స్ తెలియదు. స్మార్ట్‌ఫోన్ అంటే తెలియదు. ఇప్పుడు యాక్టీవా బండి మీద స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని ఫుడ్ డెలీవరీ చేస్తున్నది. మధ్నాహ్నం నుంచి సాయంత్రం వరకు చెన్నైలోని రెడ్‌హిల్స్, అల్వార్‌పేట ప్రాంతాల్లో రోజుకు పది ఆర్డర్లు పంచుతున్నది. వారానికి సుమారు మూడు వేల రూపాయలు సంపాదిస్తున్నది.

675
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles