ప్లూటోకు గ్రహలక్షణాలు


Tue,February 26, 2019 01:30 AM

క్యూపర్ బెల్ట్‌లోని కుబ్జగ్రహం ప్లూటోకు నిజమైన గ్రహలక్షణాలున్నాయని సీనియర్ గ్రహ భౌతిక శాస్త్రవేత్త ఒకరు ఇటీవల అభిప్రాయపడ్డారు. ఈ గ్రహానికి గ్రహహోదాను పునరుద్ధరించాలని, అసలు గ్రహానికి ఇచ్చే నిర్వచనంలోనే మౌలిక మార్పు అవసరమనీ ఆయన అంటున్నారు.
Kuiper-belt

నిజాన్ని నిగ్గు తేల్చడమే ధ్యేయంగా సాగే విజ్ఞాన శాస్త్ర పరిశోధనల్లో అస్థిరతలు సహజమే. 2006లో గ్రహహోదాను కోల్పోయిన ప్లూటోపై అప్పట్నుంచే చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఇటీవల అమెరికా రాష్ట్రం ఫ్లోరిడాలోని ఆర్లాండో నగరానికి చెందిన యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ ఫ్లోరిడా సీనియర్ గ్రహభౌతిక శాస్త్రవేత్త ఫిలిప్ మెట్జర్ ఒక ఆలోచనాత్మకమైన, విలువైన సూచన చేశారు. ఇంటర్నేషనల్ అస్ట్రనామికల్ యూనియన్ గ్రహహోదాకు ఇచ్చిన నిర్వచనం ప్రకారం ఏ గ్రహమైనా తన కక్ష్యను పూర్తి చేసుకోవాలని, ఆ మేరకు దానికి భారీస్థాయి గురుత్వశక్తి తన కక్ష్య పొడుగునా ఉండాలని అన్నారు. అయితే, ప్లూటోకు స్వీయ గురుత్వ శక్తి లక్షణాలున్నాయని, అంగారకునికన్నా అధిక చైతన్యశక్తి, గతిశాస్త్ర స్థితి కూడా ఉన్నాయని మెట్జర్ ప్రకటించారు. దాని భూగర్భంలో ఒక అఖాతం, బహుళ పొరలతో వాతావరణ వ్యవస్థ, కర్బన మిశ్రమాలు, ప్రాచీన సరస్సుల ఆధారాలు, బహుళ సంఖ్యలో చందమామలు ఉన్నట్టు ఆయన తెలిపారు. కనుక, దానికి గ్రహహోదాను దూరం చేయడం సరికాదని ఫిలిప్ మెట్జర్ పేర్కొన్నారు.

182
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles