ప్లాస్టిక్ నుంచి కళాత్మక వస్తువులు


Mon,February 18, 2019 01:09 AM

పర్యావరణ కాలుష్యానికి ప్లాస్టిక్ ఎలాంటి నష్టాలను కలిగిస్తుందో తెలిసిందే. మరి అలాంటి ప్లాస్టిక్‌ని వాడకుండా ఉండటమే మంచిది. కానీ ఈ మహిళ ప్లాస్టిక్‌తో కళాత్మక వస్తువులు తయారు చేస్తున్నది.
plastic
ఇంట్లో టూత్‌పేస్ట్ దగ్గర నుంచి షాపింగ్ మాల్ వరకూ అంతా ప్లాస్టిక్ మయం అవుతున్నది. ప్లాస్టిక్ వాడి అవతల పారేయటం రోజూ చేసే వాటిలో ఒకటి. అలా వాడిన ప్లాస్టిక్‌ను అవతల పారేయకుండా మళ్లీ ఎలా పునర్వినియోగించుకోవాలో చేసి చూపించింది ముంబైకి చెందిన ఆరవై యేండ్ల రీతూ మేకర్. రీతూకి పర్యావరణం పట్ల అమితమైన ప్రేమ. ఏదో ఒకటి చేయాలని తపించి పోయేది. కానీ ఏం చేయాలో తెయకపోయేది. ఈ క్రమంలో తన కూతురు సలహా తీసుకుంది. ఇంట్లో కూర్చుండి ఆలోచిస్తే ఫలితం ఉండదు. బయటకెళ్లి తెలుసుకోవాలి అన్న కూతురు మాటలతో రీతూ ఆలోచనలో పడింది. దీంతో ఓ షాపింగ్ మాల్ నుంచి వచ్చిన ప్లాస్టిక్ బ్యాగులను వినియోగించి మహిళలు ఏం చేస్తున్నారో ఓ వీడియోనూ చూసింది. ఆ ప్లాస్టిక్ బ్యాగులతో మహిళలు చాపలు (మ్యాట్) తయారు చేస్తున్నారు.


ఈ వీడియో ద్వారా తయారీ విధానం స్పష్టంగా అర్థమవటంతో రీతూ కూడా ఒక మొత్తం ప్లాస్టిక్ బాటిళ్లు, టూత్‌పేస్టులు, బ్యాగులను పునర్వినియోగించి వస్తువులు తయారు చేసింది. రూం మ్యాట్, ప్లాస్టిక్ హ్యాండ్ బ్యాగులు రూపొందించి ఔరా అనిపించుకుంది. మరి వాటిని అమ్మి డబ్బులు సంపాదిస్తున్నదా అంటే అదీ లేదు... అపార్ట్‌మెంట్‌లో ఉన్న వారికి, తెలిసిన వారికి ఉచితంగా పంపిణీ చేస్తున్నది. ఈ పాస్టిక్ వస్తువుల్ని వాడండి, ఇకపై వాడే ప్లాస్టిక్‌ను నివారించండి అంటూ స్ఫూర్తి నింపుతుంది. ఈమె పనిని గమనించిన ఇద్దరు మహిళలు రీతుకు సాయం చేయడానికి ముందుకు వచ్చారు. రీతూకు కళాత్మక వస్తువులు తయారు చేయటంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు.

764
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles