ప్లాస్టిక్‌ను వేరుచేసే రోబో!


Tue,April 16, 2019 11:49 PM

మనిషి కంటే వేగంగా పనిచేసే రోబోను చూశాం. హోటల్లో ఆర్డర్‌ తీసుకొని సర్వ్‌ చేసే రోబోనూ చూశాం. డ్రైవింగ్‌ చేసే రోబోను కూడా చూశాం. ఇప్పుడు తాజాగా మరో కొత్త రోబో వచ్చేసింది.
garbage_robot
ఈ ఫొటోలో కనిపిస్తున్న రోబో పేరు రోసైకిల్‌. ఇదేం చేస్తుందో తెలుసా? చెత్తను సేకరించి అందులోంచి ప్లాస్టిక్‌ వ్యర్థాలను వేరు చేస్తుంది. ఎంఐటీ విద్యార్థులు రూపొందించిన ఈ రోబో చెత్తలోని ప్లాస్టిక్‌ను గుర్తుపట్టి వేరు చేస్తుంది. ఇలా చేయడానికి గానూ.. దీనికి సెన్సర్లు అమర్చారు. ప్లాస్టిక్‌ ఈ రోబో చేతికి తగలగానే దాన్ని మిగతా చెత్త నుంచి వేరు చేసేస్తుంది. అంతేకాదు.. చెత్తలో పేరుకుపోయిన లోహాలను కూడా గుర్తుపడుతుంది. ప్రస్తుతానికి ప్రయోగదశలో ఉన్న ఈ రోబో.. 85 శాతం కచ్చితత్వాన్ని ప్రదర్శించింది. కానీ.. ఇంకా పూర్తిస్థాయిలో ఎలాంటి లోపం లేకుండా తయారుచేసేంత వరకు మార్కెట్లోకి వదలం అంటున్నారు పరిశోధకులు. ఇది గనక పూర్తయి మార్కెట్లోకి వచ్చిదంటే.. చెత్తకుప్పల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్‌ మొత్తాన్ని సేకరించి రీసైకిల్‌ చేయొచ్చు. ఆ రోజులు త్వరలోనే రానున్నాయేమో వేచి చూడాల్సిందే!

314
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles