ప్లాస్టిక్‌తో ఇంధనం


Tue,February 26, 2019 01:37 AM

ప్లాస్టిక్ చెత్తను శుద్ధ ఇంధనంగా మార్చే కొత్త రసాయనిక పరివర్తనా విధానాన్ని శాస్త్రవేత్తలు తాజాగా అభివృద్ధి పరిచారు. దీనిని వాణిజ్య ప్రాతిపదికన పెంపొందించుకోవడమే ఇక తరువాయి.
Plastic
ఆధునిక మానవుడు ఇరవైవ శతాబ్దపు తొలిరోజుల్లో ఏమని ప్లాస్టిక్ అనే కృత్రిమ (synthetic) పదార్థాన్ని సృష్టించాడో అప్పట్నుంచీ ప్రపంచ జీవనశైలి రూపురేఖలే మారిపోయాయి. వందేళ్లలోనే సమస్తం ప్లాస్టిక్ మయంగా మారి, పరిస్థితి ఎక్కడి దాకా వచ్చిందంటే ఆఖరకు మానవజాతితోపాటు మొత్తం ప్రకృతి నెత్తిమీద అదే పెద్ద విపత్తులా పరిణమించింది. ప్లాస్టిక్ కాలుష్యం వల్ల సంభవిస్తున్న విపరిణామాలు ఒకవైపు ఆందోళన కలిగిస్తున్న ఈ నేపథ్యంలోనే ఇండియానా (అమెరికా రాష్ట్రం)కు చెందిన వెస్ట్ లఫాయెట్టే నగరంలోని ఫర్డ్యూ యూనివర్సిటీ పరిశోధకులు ఒక ఆశావహ ప్రగతిని సాధించారు. ప్లాస్టిక్ చెత్తనుంచి శుద్ధ ఇంధనాన్ని తయారుచేయగల ఒక కొత్త రసాయనిక పరివర్తనా విధానాన్ని వారు అభివృద్ధి పరిచారు.


పునర్వినియోగ పరిశ్రమకు, ప్రపంచ ప్లాస్టిక్ వ్యర్థాలకు ఇదొక గొప్ప ప్రయోజనకారి కాగలదని వారు అంటున్నారు. పాలియోఫిన్ (ప్లాస్టిక్ సంబంధమైన) వ్యర్థాలలోంచి సుమారు 90 శాతం వరకూ వివిధ రకాల ఉత్పత్తులను తయారుచేస్తున్నారు. వాటిలో పాలిమర్స్, నాఫ్తా, ఇంధనాలు, మోనోమర్స్ వంటివి ఉన్నాయి. ఐతే, ఇప్పుడు ఈ కొత్త విధానంతో అత్యంత శక్తివంతమైన గ్యాసొలిన్ లేదా డీజిల్ ఇంధనాల్ని ఉత్పత్తి చేయవచ్చునని పరిశోధకులు అంటున్నారు. ఇవి పూర్తిగా శుద్ధ ఇంధనాలే కావడం విశేషం. కాగా, ఐరాస (ఐక్యరాజ్యసమితి) అంచనా ప్రకారం ఏడాదికి 8 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు అఖాతజలాల పాలవుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2050 కల్లా సముద్రాలలో చేపలకంటే ప్లాస్టిక్ కాలుష్యమే ఎక్కువైపోతుందని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ హెచ్చరించింది.

477
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles