ప్రేమపువ్వులకూ ఓ లెక్కుంది!


Thu,February 14, 2019 12:59 AM

ఈ రోజు మీ వాలెంటైన్‌ను కలవడానికి వెళ్తున్నారా? ఒక్క నిమిషం..మీ ప్రేమను వ్యక్తపరచడానికి పువ్వులు తీసుకెళ్తున్నారా? ఒక్క నిమిషం.. ఏ పువ్వులు తీసుకెళ్తున్నారు? ఎన్ని పువ్వులు తీసుకెళ్తున్నారు?అదేంటీ.. ప్రేమను వ్యక్తపరచడానికి ఒక రోజా పువ్వు చాలు కదా అంటారా!.. అవును మామూలుగా అయితే ఏ పువ్వుతో అయినా, ఎలా అయినా ప్రేమను వ్యక్తపరచ వచ్చు... కానీ ఇవ్వాళ్ల వాలెంటైన్స్ డే కదా.. కొంచెం ప్రత్యేకత ఉండాలి కదా! మరి ఇవ్వళ్ల ఇచ్చే రోజా పూలకు ఓ ప్రత్యేక ఉండే ఉంటుంది కదా! ఆ ప్రత్యేకత ఏంటంటే.. ఎన్ని రోజా పువ్వులు ఇస్తున్నామో ఆ పూల లెక్క వెనుక కూడా ప్రత్యేకతలు ఉన్నాయండోయ్ అవేంటో.. చూడండి.
love-Love

ఒక రోజాపువ్వు బహుమతిగా ఇస్తుంటే - తొలి చూపు ప్రేమ అని అర్థం...

2 గులాబీలు : గాఢమైన ప్రేమలో ఉన్నప్పుడు రెండు గులాబీలు ఇవ్వొచ్చు.
3 గులాబీలు : ఐ లవ్ యూ
4 గులాబీలు : భవిష్యత్‌లో మన మధ్య ఏ గొడవా రాదు.
5 గులాబీలు : ఒక వ్యక్తిపట్ల మీరు ఎంత శ్రద్ధ కలిగి ఉన్నారో, వారికి మీరు ఎంత ప్రత్యేకమైన వారో తెలియజెప్పడం.
10 గులాబీలు : నువ్వే నాకు పర్ఫెక్ట్.
15 గులాబీలు : ఒకవేళ మీరు మీ భాగస్వామిని బాధపెట్టి ఉంటే క్షమించు అని కోరడానికి 15 రోజాలు ఇవ్వొచ్చు.
20 గులాబీలు : విధేయతకు, నమ్మకానికి చిహ్నం.
25 గులాబీలు : అందరికన్నా ఎక్కువ సంతోషంగా ఉండాలని కోరుకోవడానికి.
30 గులాబీలు : విశ్వాసానికి, విశ్వసనీయతకు చిహ్నం.
66 గులాబీలు : నీ పట్ల నా ప్రేమ ఎప్పటికీ మారదు.
77 గులాబీలు : నువ్వు నాకు దేవుడిచ్చిన వరం.
88 గులాబీలు : పెద్ద క్షమాపణ కోరుకోవటం.
99 గులాబీలు : నా ప్రాణం ఉన్నంత వరకూ నేను నిన్నే ప్రేమిస్తా...
100 గులాబీలు : ప్రేమ మీద, ప్రేయసి మీద ఉన్న భక్తిని తెలియజేయడానికి.
ఇవండీ! ఎన్ని గులాబీలు ఇస్తే ఎలాంటి అర్థం ఉంటుందో తెలుసుకున్నారు కదా! కాబట్టి మీ భాగస్వామిని కలవడానికి వెళ్లే ముందు రోజాలను లెక్కపెట్టి తీసుకెళ్లి, తర్వాత అర్థాన్ని వివరించి ఇంప్రెస్ చేయండి. ఆల్ ద బెస్ట్...

624
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles