ప్రాయం చిన్నది.. ధైర్యం పెద్దది..


Thu,April 18, 2019 01:34 AM

నేను 21 నిమిషాలు ఆ నదిలో ఈదాను. చివరికి అతన్ని కనుక్కొన్నాను. అప్పటికే అతని నాడి తెలియట్లేదు. కృత్రిమ శ్వాస అందించాను. 30 నిమిషాల తర్వాత అతను సృహలోకి వచ్చాడు. నేను ఆ రోజు అతన్ని కాపాడడానికి ధైర్యం చేయక
పోయి ఉంటే ఏదో భావన నన్ను జీవితాంతం వెంటాడేది. 22 ఏండ్ల ఎన్‌సీసీ కెడెట్, జంతు సంరక్షకురాలు భార్గ్సెటు అనే యువతి మాటలివి.

ncc-lady
గుజరాత్‌లోని వడోదరకు చెందిన భార్గ్సెటు శర్మకు అప్పుడు 20 ఏండ్లు. ఎన్‌సీసీ కెడెట్, ఆర్మీ ఆశావహురాలు. ఆమెకు 16 ఏండ్ల వయసున్నప్పుడు హ్యూమన్స్ విత్ హ్యూమనిటీ అనే జంతుసంరక్షణ సంస్థను ఏర్పాటు చేసింది. ఒక రోజు సర్వీస్ సెలక్షన్ కమిషన్‌కు హాజరైంది. అనుకోకుండా అదే రోజు తెల్లవారి ఆమె సంస్థ ఆధ్వర్యంలో జంతుప్రేమికుల వర్క్‌షాప్ ఏర్పాటు చేయాల్సి వచ్చింది. కార్యక్రమం ముగిసిన తర్వాత వలంటీర్లు అంతా పిక్నిక్‌కు వెళ్లడానికి ప్రతిపాధించారు. దానికి భార్గ్సెటు అంగీకరించింది. అందరూ కలిసి రాసాల్‌పురాలోని మహిసాగర్ నదికి వెళ్లారు. అమె అక్కడ లోతులో ఈదలని అనుకుంది. కానీ అక్కడికి వెళ్లేసారికి అక్కడ ఒడ్డున కొందరు సాయం చేయాలని అరుస్తున్నారు. ఆ నదిలో స్థానిక యువకులు ఇద్దరు మునిగారు. అందులోంచి ఒకరిని వారే రక్షించారు. కానీ రెండో వ్యక్తి ఆచూకీ తెలియలేదు. వెంటనే భార్గ్సెటు నదిలోకి దునికింది. సుమారు 21 నిమిషాల తర్వాత ఆ యువకుని జాడ తెలుసుకుంది. బయటకు తీసుకొచ్చింది. అప్పటికే ఆయన సృహ కోల్పోయి ఉన్నాడు. శ్వాస ఆగిపోయింది. దవడలు బిగుసుకున్నాయి. తన చేతితో దవడలను వదులుగా చేసి కృత్రిమ శ్వాసను అందించింది. కొంత సేపటికి అతను సృహలోకి వచ్చాడు. అలా ఆమె అతని ప్రాణాలను రక్షించింది. ఇప్పుడతను సింగపూర్‌లో ఉద్యోగంలో స్థిరపడ్డాడు. మరోవైపు జంతుప్రేమికుల కుటుంబం నుంచి వచ్చిన భార్గ్సెటుకు వాటిని సంరక్షించడం అంటే మక్కువ అలా ఆరేండ్లలో ఇప్పటి వరకు 3800 బాధిత జంతువులను సంరక్షించింది. ఆమె ధైర్యసాహసాలకు, జంతువుల పట్ల ప్రేమకు పలు గుర్తింపులు కూడా వచ్చాయి.

133
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles