ప్రాణాలు కాపాడే డ్రోన్!


Sun,February 10, 2019 01:39 AM

లాండ్‌మైన్స్‌ను కనుక్కొనే పనిలో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. సులువుగా కనుక్కునే పద్ధతులు ఏవీ ఇప్పటివరకూ లేవు. 16 యేండ్ల ఈ కుర్రాడు లాండ్‌మైన్స్‌ను నాశనం చేసే డ్రోన్ తయారు చేశాడు. దీంతో ప్రాణాలకు ఎటువంటి ముప్పు ఉండదు.
Harshwardhansinh
ఒకప్పుడు డ్రోన్స్ వాడాలంటే ఎన్నో పర్మిషన్‌లు తీసుకోవాల్సి ఉండేది. భారతదేశంలో.. ఎగిరే డ్రోన్స్, రిమోట్ కంట్రోల్ డ్రోన్స్‌ను 2018 డిసెంబర్ 1 నుంచి లీగల్‌గా వాడొచ్చని ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో డ్రోన్స్‌ల తయారీ మీద ఎంతోమంది పిల్లలు ఆసక్తి కనబరుస్తున్నారు. నానో, మైక్రో, స్మాల్, మీడియమ్, లార్జ్ ఇలా ఎన్నో రకాలను చేయొచ్చు. అందులో నానో రకాలు 250గ్రా.ల బరువు కంటే తక్కువ ఉంటే ఎలాంటి లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదని ఒక పాలసీ కూడా వచ్చింది. దాన్ని అనుసరించి గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కి చెందిన 16 యేండ్ల హర్షవర్థన్ సింగ్ జాలా ఈగల్ ఏ7 అనే డ్రోన్ తయారు చేశాడు. మనుషులకు ఎటువంటి ప్రాణహాని కలుగకుండా చెట్లలో, పుట్లలో దాగున్న లాండ్‌మైన్స్‌ను సులువుగా కనిపెడుతుంది. ఈ టెక్నాలజీ ఇప్పటివరకు ఎక్కడా లేదు, రాలేదని హర్ష చెబుతున్నాడు. అంత చిన్న వయసులో ఇన్ని తెలివితేటలు చూసి అందరు ఆశ్చర్య పోతున్నారు. నీ మేధస్సుకి తగ్గ ఉద్యోగం మేమిస్తామంటూ ఇతర దేశాలనుంచి ఎన్నో అవకాశాలు వచ్చాయి. కానీ, నేను అభివృద్ధి చేసిన డ్రోన్ భారత సైన్యం, సీఆర్‌పీఎఫ్, జవానులను ప్రాణాలతో రక్షించడానికి మాత్రమే వినియోగించాలి అని చెబుతున్నాడీ అబ్బాయి. జవానుల ప్రాణాలు కాపాడే ఈగల్ ఏ7 డ్రోన్ తయారు చేసిన హర్షని అందరూ అభినందిస్తున్నారు.

650
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles