ప్రాణాలు కాపాడింది!


Mon,December 31, 2018 01:06 AM

రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగితే చూసీ చూడనట్టు వెళ్లిపోతుంటారు. కాపాడండి అన్నా కనీసం అంబులెన్స్‌కి ఫోన్ చేసేంత సమయం కూడా ఉండదు కొందరికి. వారిలా ఆమె కూడా నాకెందుకులే అనుకొని ఉంటే ప్రమాదానికి గురైనవారు దవాఖానలో చికిత్స తీసుకునేవారు కాదు. ఎవరామె?
accident
కేరళలో ఒక రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్నది. కారులో ఉన్న 44 యేండ్ల మహిళ, గీతా సంతోష్‌లకు బాగా గాయాలయ్యాయి. కారుని చూస్తే పనికొచ్చే ఆనవాళ్లెక్కడా కనిపించడం లేదు. అందులోని వారు కాపాడమని అర్థిస్తున్నారు.కానీ ప్రమాదాన్ని వినోదంలా చూస్తూ నిలుచున్నారు అక్కడి ప్రజలు. మనోరమ ఆన్‌లైన్‌లో వీరిని కాపాడండి అంటూ న్యూస్ నడుస్తుంది. ఈ వార్త ఒక మహిళ వరకు వెళ్లింది. ఇంతమంది జనం ఉన్నా ఇంకెవరో వచ్చి కాపాడాలి. మనుషులు రాను రాను మృగాలకన్నా హీనంగా మారుతున్నారనుకున్నది ఆమె. ప్రమాదానికి దగ్గర్లో ఉన్న స్కూల్‌కి చుట్టాల అబ్బాయిని వదలిపెట్టడానికి వెళ్లింది తను. వార్త తెలియగానే వెంటనే వెనక్కి తిరిగి ప్రమాద స్థలాన్ని చేరుకుంది. అందరిలా చూస్తూ ఉండలేదు. వారిని పక్కకు నెట్టి ముందుకు వెళ్లింది. కారులో ఇరుక్కుపోయి రక్తం ధారాలుగా ప్రవహిస్తున్న వారిని చూసి బాధతో అంబులెన్స్‌కు ఫోన్ చేసి దవాఖానకు చేర్చింది. కుటుంబ సభ్యులకు విషయాన్ని తెలియజేసింది. తన మానవత్వం వల్లే రెండు ప్రాణాలు బతికేలా చేసింది. నీ రుణం ఎలా తీర్చుకోవాలని కుటుంబ సభ్యులు అమెని అభినందనలతో ముంచెత్తసాగారు.

482
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles