ప్రాణాయామంతో ప్రాణం పదిలమేనా?


Thu,April 20, 2017 11:42 PM

pranayam
ప్రాణాయామం, బ్రమరీ, నాడీ శోధన ప్రాణాయామం వంటి యోగా ప్రక్రియలు రక్తపోటును తగ్గించడానికి ఉపయోగపడతాయని యోగా ఇన్‌స్ట్రక్టర్ రవీంద్రకపాడియా సూచించారు. పడుకుని ఉన్న భంగిమలో ఈ రకమైన ప్రాణాయామాలు విశ్రాంతిగా ఉండి సాధన చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుందని, ఇవే ప్రక్రియలు కూర్చున్న భంగిమలో చెయ్యాలనుకుంటే వెన్నెముఖ నిటారుగా ఉంచి, ఛాతి పైకెత్తి, తల కాస్త కిందకు వంచినట్లుగా ఉంచి చెయ్యడం వల్ల గుండె మీద ఒత్తిడి పడకుండా ఉంటుందని అంటున్నారు. వీటి గురించి కాస్త వివరించగలరు.
వెంకట్రావ్, వరంగల్

యోగా, ప్రాణాయామం వంటివన్నీ శరీరంలో జరిగే జీవక్రియలను క్రమబద్ధీకరిస్తాయి. అందులో భాగంగానే కార్డియోవాస్కులార్ రిఫ్లక్సెస్, హైపర్‌టెన్షన్, ఎరిథమియాసిస్ (హృదయ స్పందనలో తేడాలు) వంటి సమస్యలకు ప్రాణాయామం, యోగా ప్రక్రియలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ముఖ్యంగా శవాసనం గుండె జబ్బులున్న వారికి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. దాదాపుగా అన్ని ప్రాణాయామాలు కూడా గుండె జబ్బులున్న వాళ్లూ చెయ్యవచ్చు కానీ కపాలబాతి మాత్రం వీరు చెయ్యకూడదు. ఇది నష్టాన్ని కలిగించే ప్రమాదం ఉంటుంది.
డాక్టర్ పి. ఎల్. ఎన్. కపర్థి
సీనియర్ ఇంటర్ వెన్షనల్ కార్డియాలజిస్ట్
అపోలో హాస్పిటల్స్
హైదరాబాద్

633
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles