ప్రాణాంతక పసరికలు


Mon,February 4, 2019 11:48 PM

jaundice
పసరికలు అంటే తెలుసా? అదేనండీ కామెర్లు. ఒక్కోసారి ప్రాణం పోయేదాకా వీటిని గుర్తించలేం. వ్యాధి లక్షణాలేంటో తెలిస్తే వెంటనే పరీక్ష చేయించుకోవాలి. లేకపోతే తీవ్ర అనారోగ్యానికి గురిచేస్తుంది. కాబట్టి పసరికలను ఎలా గుర్తించాలి? చికిత్స ఏంటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? తెలుసుకుందాం.
చర్మం.. కళ్లు పచ్చని రంగులోకి మారడమే కా మెర్లు. రక్తంలోకి బైలిరుబిన్ అధికంగా చేరటంవల్ల ఈ వ్యాధి వస్తుంది. బైలిరుబిన్ పరిమాణం అధికం అయి అది మిగతా కణజాలంలోకి చేరుతుంది. వాటన్నింటినీ పుసుపు రంగులోకి మారుస్తుంది. మామూలుగా అయితే బైలిరుబిన్‌ను కాలేయం తొలగించేస్తుంటుంది. కాలేయానికి చేరుకోగానే దానిపై కొన్ని రసాయనాలు పనిచేస్తాయి. అప్పుడది అన్ కంజుకేటెడ్ బైలిరుబిన్ పదార్థంగా మారిపోతుంది. దీనిని కాలేయం పైత్యరసంలోకి పంపేస్తుంది.

ఎలా గుర్తించాలి?

మామూలుగా అయితే చర్మం.. కళ్లు పుసుపు రంగులోకి మారడం వల్ల పసరికలను గుర్తించవచ్చు. తల నుంచి మొదలై శరీరమంతా ఇది వ్యాపిస్తుంది. ఇది కాకుండా మరికొన్ని లక్షణాల ద్వారా కూడా పసరికలు శరీరంలోకి వ్యాపిస్తాయి. చర్మంలో బైల్ సాలట్స్ అధికంగా చేరటంతో శరీరం అంతటా దురదలు పెడుతుంటాయి. విపరీతమైన అలసట ఏర్పడుతుంది. బరువు తగ్గిపోతారు. హఠాత్తుగా జ్వరం వస్తుంది. వాంతులవుతాయి. పొట్టలో తీవ్రమైన నొప్పి ఏర్పడుతుంది. మూత్రం చిక్క గా.. గోధుమరంగులో వస్తుంది. మలం.. పసు పు, ఆకుపచ్చ రంగులో వస్తుంది. ఈ లక్షణాలు కనిపిస్తే కా మెర్లు ఉన్నట్లుగా గుర్తించాలి.

కారణం ఏంటి?

రెండు కారణాల వల్ల కామెర్లు సోకుతాయి. మొదటిది.. శరీరంలో బైలిరుబిన్ అత్యధికంగా ఉత్పత్తి కావడం వల్ల. రెండోది.. సహజంగా ఉత్పత్తి అవుతున్న బైలిరుబిన్‌ను కాలేయటం తొలగించలేక పోవటం వల్ల. రెండు సందర్భాల్లోనూ బైలిరుబిన్ శరీర కణజాలంలో చేరి స్థిరపడుతుంది. దీనివల్ల కాలేయం వాస్తుంది. పైత్యరస నాళంలో అడ్డంకులు ఏర్పడతాయి. హెమోలైటిక్ ఎనీమియా సమస్య ఏర్పడుతుంది. మలేరియా వంటిది కూడా దరిచేరుతుంది. పైత్యరసం విడుదలో అడ్డంకులు ఏర్పడటం వల్ల కంజుకేటెడ్ బైలిరుబిన్ విసర్జితం కాకుండా కాలేయంలోనే ఉండిపోతుంది. వయోజనుల్లో అయితే అధికంగా మద్యపానం అలవాటు ఉంటే ఈ సమస్య వస్తుంది. హెపటైటిస్-బీ, సీ వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా జాండీస్ వస్తాయి. హెపటైటిస్-ఏ, ఈ వైరస్‌ల వల్ల వచ్చే కామెర్లు చాలా ప్రమాదకరం. వీటివల్ల ప్రాణాపాయం కూడా ఉంటుంది.
causes-of-jaundice

నయం చేయొచ్చు

కామెర్లకు సరైన చికిత్స చేయించుకోలేకపోతే కాలేయం దెబ్బతింటుంది. హెపటైటిస్ కారణంగా వచ్చిన కామెర్లను తగ్గించటానికి యాంటీ వైరల్, స్టెరాయిడ్ మందులను ఇస్తారు. నాళాలలో అడ్డంకుల కారణంగా కామెర్ల వ్యాధి సోకితే శస్త్రచికిత్స ద్వారా తొలగించి పరిస్థితి మెరుగుపరుస్తారు. ఏవైనా మందులు వాడటం వల్ల వాటిలోని రసాయనాల వల్ల కామెర్ల వ్యాధికి గురైన పక్షంలో మొదట వాటి వాడకం నిలిపి వేయిస్తారు. ప్రత్యామ్నాయ ఔషధాలను సిఫార్సు చేయటం ద్వారా దుష్ఫలితాలను తగ్గించి వ్యాధి తగ్గేట్టు చేస్తారు. కామెర్లు నయం అయ్యేవే కాబట్టి.. భయాందోళనకు గురి కావద్దు. అప్రమత్తంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. చేజేతులా కామెర్లకు ప్రాణాన్ని పణంగా పెట్టొద్దు.
SELAVAN

ఎలా నిర్ధారిస్తారు?

మొదటగా పొట్టలో గడ్డలు ఏమైనా ఉన్నాయా? కాలేయం గట్టిపడిందా? వంటి పరీక్షలు చేస్తారు. కాలేయం గట్టిగా మారటం సిరోసిస్ వ్యాధిని సూచిస్తుంది. లివర్ ఫంక్షన్ టెస్ట్ ద్వారా కామెర్ల స్థితిని తెలుసుకోవచ్చు. కాలేయం సరిగ్గ ఆపనిచేస్తుందా లేదా అనే పరీక్ష ద్వారా వ్యాధిని నిర్ధారిస్తారు. కారణాలు బయటపడని పక్షంలో బైలిరుబిన్ పరిమాణం.. రక్తపు తాజా పరిస్థితిని అర్థం చేసుకోవటానికి బైలిరుబిన్ టెస్ట్.. ఫుల్ బ్లడ్ కౌంట్.. కంప్లీట్ బ్లెడ్ కౌంట్.. హెపటైటిస్ టెస్టుల ద్వారా కూడా పసరికలను నిర్ధారిస్తారు.

886
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles