ప్రాణశక్తి కేంద్రంగా ఊపిరితిత్తులు


Tue,March 5, 2019 03:13 AM

Panitanam
మనిషితోపాటు ప్రాణవాయువును పీల్చుకొని బతికే వెన్నెముక జీవులన్నింటికీ ప్రాణశక్తి కేంద్రంగా ఉపిరితిత్తులు (Lungs)లు అత్యంత కీలకమైన పాత్రపోషిస్తాయి. ఇది చాలా సున్నితమైన, తేలికైన, సాగేగుణంతోగల స్పాంజి మాదిరిగా వుండే శరీర అంతర అవయవం. సాధారణంగా ఊపిరితిత్తులు (శ్వాసకోశాలు) మనిషి (జీవి) పుట్టినప్పట్నించీ ఎల్లవేళలా గాలితో నిండి ఉంటాయి. అరోగ్యకరమైన శ్వాసకోశాలు నీటిలో తేలుతాయి. వీటిని చేతితో పట్టుకొని పిండితే లోని గాలి వల్ల ఫెళఫెళమంటాయి. ఒకవేళ వీటికి వ్యాధి సోకితే మాత్రం నీళ్లలో మునిగిపోతాయి. రెండు ఊపిరితిత్తులూ వేర్వేరు తమ్మెలు (భాగాలు)గా విభజితమైతే, కుడివైపు భాగం (తిత్తి) మూడు విభాగాలుగా, ఎడమ వైపుది రెండువిభాగాలుగా మళ్లీ విభజితమై ఉంటాయి. ఈ చిన్న తమ్మెలలోనూ మళ్లీ అంతర్గతంగా వందలాది లఘు భాగాలు (lobules) ఉంటాయి.

వాతావరణంలోని, మనం పీల్చిన గాలిలోంచి ప్రాణవాయువు (ఆక్సీజన్)ను గ్రహించి, శరీరంలోని కార్బన్ డై ఆక్సైడ్ (బొగ్గుపులుసు వాయువు)ను బయటికి పంపించడమే శ్వాసకోశాల ముఖ్యవిధి. దీనితోపాటు నీరు, మద్యం, ఔషధ సంబంధ కారకాలను కూడా ఇవి గ్రహించి బయటికి వదిలిపెడ్తాయి. రోజుకు కనీసం ఒక క్వార్ట్ (సుమారు 1.14 లీటర్లు) నీటినైనా ఊపిరితిత్తులు బయటకు పంపిస్తాయని అంచనా. అలాగే, ఎనెస్థెటిక్ (నొప్పి, ఉష్ణశీతల లక్షణాలు తెలియకుండా చేసే) వాయువులైన ఈథర్, నైట్రస్ ఆక్సైడ్ వంటివాటినీ ఇవి గ్రహించి బయటికి విడుదల చేస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే, శ్వాసకోశం నిజమైన ఒక జీవక్రియ అవయవం.

477
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles