ప్రాణం నిలిపి.. చేరదీసి..


Wed,April 17, 2019 01:02 AM

ఈ కుక్కలన్నీ మా ఇంటి చుట్టూ ఎందుకు తీసుకెళ్లండి అన్నారు. అపార్ట్‌మెంట్‌లో అందరూ ఫిర్యాదు చేశారు. ఇండ్లు మారింది, ఊర్లు మారింది. చివరకు నోయిడాలో ఓ విశాలమైన స్థలాన్ని కొన్నది. ఇదంతా కుక్కల కోసం..
anuradha-2
ఘజియాబాద్‌కు చెందిన ఈమె పేరు అనురాధ. ఓ రోజు తన ఇంటి శివారులో ఎనిమిది కుక్కలు రోడ్డుమీద పడి కనిపించాయి. ఎవరో వాటికి విషపదార్థాలు పెట్టారు. దీన్ని గమనించిన అనురాధ వాటి దగ్గరకు వెళ్లింది. వెంటనే ఆటోలో వాటిని స్థానిక పశువైద్యశాలకు తీసుకెళ్లింది. వాటిలో ఐదు కుక్కలు ప్రాణాలతో బయటపడ్డాయి. ఇలాంటి ఘటనే ఆమెకు మరోసారి ఎదురైంది. పక్షవాతం ఉన్న పప్పీని వదిలేశారు. దానికి సరైన చికిత్స చేయించి అనురాధ తన ఇంటికి తీసుకొచ్చింది. అప్పటి నుంచి ఆమెకు కుక్కల పెంపకంపై దృష్టిమల్లింది. యజమానుల చేతిలో చావుకు గురవుతున్న కుక్కలను గుర్తించి ఆమె చేరదీయడం ప్రారంభించింది. ఇలా రోజు రోజుకూ కుక్కల సంఖ్య పెరిగేది. ఆమెది అద్దె ఇల్లు. కుక్కల సంఖ్య పెరగడంతో ఇరురుగుపొరుగు వారు అభ్యంతరం వ్యక్తం చేసేవారు. ఇలా ఆమె ఘజియాబాద్‌లో నివాసం కోసం ఇబ్బందులు పడేది. అయినా కుక్కలను చేరదీయడం మాత్రం విరమించలేదు. ప్రతిదశలో ఆమెకు చుట్టుపక్కల వారి నుంచి ఫిర్యాదు రావడంతో ఆమె ఘజియాబాద్‌ను వదిలేసి నోయిడాకు బయల్దేరింది. విశాలమైన స్థలాన్ని కొని అక్కడే నివాసం ఏర్పాటు చేసుకుంది. ఇప్పుడు ఆమె హోప్ ఫర్ స్పీచ్‌లెస్ సోల్స్ అనే సంస్థను ప్రారంభించి, మూగజీవాలను చేరదీస్తున్నది.
anuradha

136
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles