ప్రశ్నోపనిషత్


Fri,February 15, 2019 01:36 AM

-ఎవరు నిజమైన గురువు?
- పంపినవారు: రామక రాజన్న శర్మ, హనుమకొండ

-సద్గురువు ఇలా ఉండాలి!
Prashnopanishat
ఆధ్యాత్మిక పరంగానే కాదు, మరే రంగంలోనైనా సరే, నిజమైన గురువుకు కొన్ని ఉత్తమ, ఉదాత్త లక్షణాలు తప్పక ఉండాలని భారతీయ ధార్మిక శాస్ర్తాలు పేర్కొన్నాయి. ముఖ్యంగా ఆధ్యాత్మిక సాధనలో వున్నవారికి గురువు మార్గదర్శనం తప్పనిసరి. ఆ గురువు సత్యసంధుడై, తాను ఆత్మసాక్షాత్కారాన్ని పొందిన వాడై ఉన్నప్పుడే తన శిష్యులకు ఆ మేరకు సద్గతి చూపుతాడు. ఏ శిష్యుడైనా గురువును మించిపోవడం సర్వసాధారణమే. ఇలా జరిగినప్పుడే వారిరువురూ నిజమైన గురుశిష్యులుగా పరిగణనలోకి వస్తారు. ఎవరైనా సరే, తమంతట తాముగా సత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాల్సిందేనని ఆదిగురువు పరమశివుడు, పరమాత్మ స్వరూపుడైన శ్రీకృష్ణుడు ప్రవచించినట్లు వేదాలు చెప్పాయి. సత్యయుగం నుంచి ద్వాపర యుగం వరకూ అనేక మంది ఆదర్శ గురువుల ఇతివృత్తాలు వున్నాయి. వారి జీవితాలే మనందరికీ దారిదీపాలు.
- సావధానశర్మ

702
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles