ప్రశ్నోపనిషత్


Thu,January 31, 2019 11:23 PM

Prashnopanishdad
మనిషి జన్మ అత్యంత ఉత్కృష్ఠమైందని, ప్రతీ ఒక్కరూ ధర్మబద్ధమైన జీవితమే గడపాలనీ ఆధ్యాత్మిక వేత్తలు అంటారు. అయితే మరి, ధర్మమంటే ఏమిటి? కాలాన్నిబట్టి ధర్మాలు ఎందుకు మారుతుండాలి? అసలు ధార్మిక జీవనం ఎందుకు? ఇలాంటి మౌలిక ప్రశ్నల నుంచి బొట్టు ఎందుకు పెట్టుకోవాలి? బ్రాహ్మణులకు పిలక ఎందుకు? విగ్రహారాధన అవసరమా? మంగళహారతిని కళ్లకు అద్దుకోకూడదా? వంటి సాధారణ సందేహాలైతే అనంతం. యక్షుడంతటి వారికే సందేహాలు వచ్చినప్పుడు మానవ మాత్రులం, మారే కాలంతోపాటు కొట్టుకుపోతున్న గడ్డిపరకలం మనమెంత? ఎప్పటి కప్పుడు సందేహాలు నివృత్తి అవుతూనే ఉన్నా కొత్త ప్రశ్నలు మొలకెత్తుతూనే ఉన్నాయి. సుసంపన్నమైన భారతీయ తాత్విక జీవనంలోని ఉత్తమ విలువలను మా పాఠకులకు అందించాలన్న బృహత్ బాధ్యతతో ఈ కొత్త శీర్షికను చేపడుతున్నాం.


అందరూ సహకరిస్తారని ఆశిస్తూ, ఇదుగో ఇక్కడ కొందరు లేవనెత్తిన కొన్ని నమూనా ప్రశ్నలను ఇస్తున్నాం. పాఠకుల్లో ఎవరికి, ఏ ధార్మిక పరమైన సందేహం వచ్చినా మాకు రాయండి. అది అందిన వెంటనే ముందు ప్రశ్ననే ప్రచురిస్తాం. దానికి సమాధానం సేకరించే బాధ్యతను మేమే తీసుకొంటాం. కానీ, పాఠకుల్లో కూడా పండితులు, ప్రజ్ఞావంతులు ఉంటారు కనుక, ఎవరికైనా వాటికి సమాధానాలు తెలిస్తే మాకు రాయవలసిందిగా సవినయ మనవి. ఐతే, అవి ఏవో మీకు తెలిసినవి కాకుండా అత్యంత శాస్ర్తోక్తమైన, శాస్త్రీయమైన, వాస్తవికమైన, ప్రామాణికమైనవి మాత్రమే అయుండాలి. అందుతున్న కొద్దీ వెంట వెంటనే ఈ పేజీలో ప్రచురిస్తుంటాం.

515
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles