ప్రవర్తనే సాయపడుతుంది!


Tue,February 5, 2019 10:24 PM

సమాజంలో వివిధ రకాల అభిరుచులున్న వ్యక్తులు కనిపిస్తుంటారు. అయితే ఒంటరిగా ఉన్నప్పుడు ఒకలా, పదిమంది స్నేహితులతో కలిసి ఉన్నప్పుడు మరోలా ఉంటారట. అందులోనూ కొత్తవారితో అయితే కొంచెం జాగ్రత్తగా మలుచుకుంటారట. ఇదే విషయం కెనడాలోని వాటర్‌లూ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు వెల్లడించారు.
boost-ur-body
బయట సరదాగా గడిపే సమయంలోనే మనిషి ప్రవర్తన ఏ విధంగా ప్రభావం చూపుతుందనే అంశంపై వాటర్‌లూ యూనివర్సిటీ పరిశోధకులు అధ్యయనం చేశారు. ఇలాంటి సందర్భంలోనే అసలు విషయాలు బహిర్గతమవుతాయట. సంతోషంగా అందరితో గడిపే సమయంలో ఒక వ్యక్తి హావభావాలు ఎంతో ప్రభావాన్ని చూపుతాయి. ఆ ప్రభావం కొందరికి ప్రతికూలంగానూ, మరి కొందరికి అనుకూలంగానూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొందరి తీరు పట్ల హాని కూడా జరిగే ప్రమాదం ఉందని వారు తమ పరిశోధనలో వెల్లడించారు. శరీరంలో వచ్చే హావభావాలు కొన్నిసార్లు మేలు కూడా చేస్తాయని ఆ అధ్యయనంలో తేలింది. కొంతమంది బయటకు వెళ్లినప్పుడు కావాలని తమ వినమ్రతను చూపిస్తుంటారు. దాని వల్ల చాలా అనర్థాలు వస్తాయి. ఒకవేళ ఎప్పుడూ ఒకేలా ఉంటే అటువంటి వారికి ఏ మాత్రం ఇబ్బందులుండవు. 17 ఏండ్ల నుంచి 25 ఏండ్లున్న 92మంది అమ్మాయిలను వరుసగా ఏడు రోజుల పాటు ఒకే దగ్గర ఉంచి వారి ప్రవర్తనలపై పరిశోధన చేసి వాటి వల్ల జరిగే పరిణామాలను గురించి అధ్యయనం చేసి ఫలితాలను వెల్లడించారు.

339
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles