ప్రయాణానికి ముందు..


Fri,March 1, 2019 01:27 AM

విమానంలో ప్రయాణించినా, షిప్‌లో వెళ్లినా, రైలులో తిరిగినా రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించినా ఆనందం, సౌకర్యం ఎక్కడా దొరకదు. అందుకే చాలామంది రోడ్డు ట్రిప్స్ వేస్తుంటారు. మీరు కూడా రోడ్డు యాత్రలు చేయాలనుకుంటున్నారా? మీ యాత్ర విజయవంతంగా సాగాలంటే ఈ టిప్స్ ఫాలో అవుతూ ముందుకు వెళ్లండి.
road-trip
-గమ్యాన్ని ముందే తెలుసుకొని ప్రణాళికను సిద్ధం చేసుకోండి.
-మీ ప్రయాణంలో ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తున్నారు. ఏఏ ప్రాంతాల్లో ఉండాలనుకుంటున్నారు. దారి పొడవుగా ఉన్న సౌకర్యాల గురించి అవగాహన తెచ్చుకోండి.
-మీరు వెళ్లే ట్రిప్‌కి ఎంత ఖర్చు అవుతుంది. ఖర్చులమీద ముందే పరిశోధన చేసుకుంటే మంచిది. మీకు కావాల్సిన డబ్బు, ఉన్న డబ్బును అంచనా వేసుకోండి.
-మీరు వెళ్తున్న గమ్యానికి సులభమైన, వేగంగా వెళ్లే మార్గం కోసం చూడండి. గూగుల్ మ్యాప్ ద్వారా గానీ, ఇంటర్నెట్ సర్వీస్ ద్వారా గానీ అనుభవం ఉన్న డ్రైవర్ల వద్ద ఈ విషయాలను చర్చించండి.
-గమ్యస్థానంలో ఉన్న హోటల్స్ గురించి ఒకటికి రెండుసార్లు తెలుసుకోండి. తక్కువ ధరలో మంచి సర్వీస్ ఇచ్చే హోటల్స్ ఉంటే వాటిని ఎంపిక చేసుకోవడం ఉత్తమం. హోటల్స్‌లో కాకుండా సర్వీస్ అపార్ట్‌మెంట్స్, అద్దె ఇండ్లు తీసుకుంటే డబ్బు ఆదా అవుతుంది. ఏదైనా సరే ముందే అడ్వాన్స్‌గా బుక్ చేసుకోండి.
-మీరు వెళ్తున్న ప్రదేశాల గురించి, వాటి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల గురించి ముందే తెలుసుకోవడం మంచిది.
-కారు, బైక్ ఎలా వెళ్లినా ముందు బండి కండీషన్‌ని చెక్ చేయించి పెట్టుకోవడం ఉత్తమం.

395
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles