ప్రయాణం - ఆరోగ్యం


Thu,January 24, 2019 11:58 PM

ప్రెగ్నెన్సీతో ప్రయాణం చేస్తే..గర్భవతిగా ఉన్నప్పుడు ప్రయాణం అంటే భయంగా ఉంటుంది. ఎప్పుడు, ఎలాంటి పరిస్థితుల్లో ప్రయాణం చేస్తే బాగుంటుందో తెలుసుకోండి.
admin-panel
-మొదటి త్రైమాసికంలో ప్రయాణాలు చేయొచ్చు. కానీ అలసట, విసుగు రావడం వంటివి ఇబ్బంది పెడుతాయి. ఒక్కోసారి అబార్షన్ కూడా అయ్యే ప్రమాదం ఉంటుంది.
-రెండవ త్రైమాసికంలో సులభంగా ప్రయాణాలు చేసుకోవచ్చు. ప్రయాణంలో మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఆహారం కూడా ఇంటి నుంచి తీసుకెళ్లింది అయితే నష్టం ఉండదు.
-మూడవ త్రైమాసికంలో ఎంత తక్కువ ప్రయాణాలు చేస్తే అంత మంచిది. ఆ సమయంలో ప్రయాణం అవసరం అయితేనే చేయాలి. వీలైతే డాక్టర్ అందుబాటులో ఉండేలా జాగ్రత్తపడాలి.
-వెళ్తున్న వాహనంలో అన్ని సౌకర్యాలు ఉంటే ఏం కాదు. బస్, రైలు ప్రయాణం కన్నా సొంత వాహనం, కారు ప్రయాణం అయితే మంచిది.
-ప్రయాణం చేసే ముందు హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకుంటే బాగుంటుంది. ఆ సమయంలో గతంలో చేసిన మెడికల్ రిపోర్ట్స్ వెంట పెట్టుకోండి.

445
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles