ప్రపంచంలోనే ఖరీదైన పిల్లులు


Thu,February 28, 2019 02:01 AM

british
పెంపుడు జంతువుల్లో అనేక రకాలున్నాయి. వాటిల్లో కుక్కల తర్వాత ఎక్కువగా పెంచుకునేది పిల్లులనే. భారతదేశంలో కొన్నిచోట్ల పిల్లులను అపశకునంగా భావిస్తుంటారు. కానీ ఇతర దేశాల్లోపిల్లులను లక్షలు వెచ్చించి మరీ కొనుగోలు చేస్తున్నారు. అక్కడి జంతు ప్రేమికులకు ఈ పిల్లులంటే ఎంతో ఇష్టం. తమ ఇష్టాన్ని పిల్లిని కొనుగోలు చేసిన ధర రూపంలోనే తెలియజేస్తున్నారు. పిల్లి జాతిలోనూ చాలా రకాలున్నాయి. ఒక్కో జాతికి ఒక్కో ప్రత్యేకత ఉన్నది. అటువంటిపిల్లులను కొనడానికి పెద్ద మొత్తంలో ఖర్చు పెడుతుంటారు క్యాట్ లవర్స్. ఆ ఖరీదైన పిల్లుల గురించే ఈ వారం విశేష.

బెంగాల్

bengal
ఇది చాలా అందమైన పిల్లి. ఈ పిల్లి ధర 10వేల డాలర్లు. అంటే 7లక్షల 3వేల వరకూ ఉంటుంది. చాలా చాకచక్యంగా వ్యవహరిస్తూ ఉంటుంది. ఆసియాలో మంచు ప్రదేశాల్లో నివసించే స్నో లియోపార్డ్ అనే జాతికి చెందిన పిల్లిని, దేశీయవాళి పిల్లికి జన్మించింది బెంగాల్ క్యాట్. మనుషులు చెప్పిన మాటలను గ్రహించడంతోపాటు చాలా విశ్వాసంగా మసలుకుంటుంది.

సవన్నా

savannah-cat
ఇది ప్రపంచంలోని మరొక ఖరీదైన పిల్లి జాతి. దీని ఖరీదు ఎంతో తెలుసా 20వేల డాలర్ల కంటే ఎక్కువగా పలుకుతున్నది. భారతదేశ కరెన్సీలో 14,05 725 రూపాయలన్న మాట. అయితే కొన్ని దేశాల్లో వీటి ధర 35లక్షల వరకూ పలుకుతుంది. ఈ జాతి పిల్లిలో ఉండే అరుదైన జన్యువుల కారణంగానే దీనికి అంత రేటు. ఇది ఆఫ్రికాకు చెందిన సెర్వల్ అనే పిల్లి దేశీయ పిల్లి కలయిక వల్ల పుట్టిన మిశ్రమ జాతికి చెందింది. ఈ జాతి మొదటి తరానికి చెందిన పిల్లి ప్రపంచంలోనే ఖరీదైన
ధర పలికింది.

అషేరా

Cat-Big
అన్ని పిల్లుల కంటే ఎంతో తెలివైన, చురుకైనది. అత్యంత ఖరీదైన పిల్లి ఇది. 10లక్షల రూపాయల నుంచి 70లక్షల వరకూ ధర ఉంటుంది. అషేరా జాతి పిల్లులు అన్నింటికంటే ఎక్కువ అభిమానంగా, విశ్వాసం కనబరుస్తాయి. ఆఫ్రికన్ సర్వల్ క్యాట్ ,ఆసియన్ లియోపార్డ్ క్యాట్, డొమెస్టిక్ క్యాట్‌ల కలయిక నుంచి వచ్చిందే అషేరా. ఇవి చూడడానికి ముచ్చటగా అనిపించడమేకాకుండా పులి వలే గంభీరంగానూ ఉంటుంది.

మైనే కూన్

coon-cat
అత్యంత ఆదరణ కలిగిన జాతి. మొట్ట మొదటిసారిగా మైనే కూన్ పిల్లిని అమెరికాలో కనుగొన్నారు. వీటిలో మగ పిల్లులు 5 కిలోల నుంచి 11కిలోల వరకూ బరువుంటాయి. ఆడ పిల్లులు 3 నుంచి 8 కిలోల వరకూ ఉంటాయి. ఇవి మీటరు పొడవు ఉంటాయి. ఈ జాతికి చెందిన పిల్లులు నలుపు, తెలుపు, గోధుమ, ఎరుపు రంగుల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. దీని వెల రూ.7౦వేలకు పైగా ఉంటుంది. సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉంటుంది. మైనే కూన్ అమెరికా
అధికారిక జంతువు కూడా.

బ్రిటిష్ షాైర్టెర్

ప్రపంచంలో ఖరీదైన టాప్ టెన్‌లో బ్రిటిష్ షాైర్టెర్ జాతి ఒకటి. యూరప్ దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇది అత్యంత పురాతనమైన జాతికి చెందినదిగా శాస్త్రవేత్తలు నిర్ధారించారు. రోమన్ల కాలంలో కూడా బ్రిటిష్ షాైర్టెర్ ఉన్నట్లు తెలుస్తున్నది. దీని ధర లక్ష నుంచి లక్షన్నర వరకూ ఉంటుంది.

755
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles