ప్యాడ్స్‌తో.. ప్రపంచ రికార్డు!


Fri,January 18, 2019 01:42 AM

శానిటరీ నాప్‌కిన్‌లతో రికార్డు నెలకొల్పొచ్చని ఎవరైనా అనుకుంటారా? కానీ బెంగళూరుకి చెందిన మహిళలు ఆ పనిచేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు. దీనిద్వారా బహిష్టు సమయంలో వ్యక్తిగత శుభ్రతపై అవగాహన కల్పించాలని వాళ్లు భావించారు.
sanitary_napkins
ఆడవాళ్లు ఆ ఐదు రోజుల బాధ వర్ణనాతీతం. అలాగే ఆ సమయంలో వ్యక్తిగత శుభ్రత కూడా ముఖ్యం. కానీ ఇప్పటికీ చాలామంది శుభ్రత విషయంలో వెనుకే ఉన్నారట. భారతదేశంలో 58శాతం మంది మాత్రమే ఇప్పటికీ వ్యక్తిగత శుభ్రత పాటిస్తున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ సంఖ్య పెరుగాలంటే మహిళల్లో సరైన అవగాహన ఉండాలి. దీన్ని సాధించేందుకు బెంగళూరుకి చెందిన ఇండియా కాంగ్రెస్ ఆఫ్ ఒబేయెస్ట్రిక్ అండ్ గైనకాలజీ (ఏఐసీఓజీ) ప్యాడ్స్‌ని ప్రమోట్ చేయాలనుకున్నది. ఐదు వందలమంది ఏడున్నర గంటల పాటు కష్టపడి 10,105ప్యాడ్‌లను ఒక వరుస క్రమంలో పేర్చారు. అది కూడా 1,078 మీటర్ల పొడువున ఉంచి మధ్యలో అండాశయాన్ని గీశారు. గర్భాశయ అంటువ్యాధులు, మూత్రాశయ వ్యాధులు రాకుండా జాగ్రత్త పడేందుకు అవగాహన కల్పిస్తున్నట్టు ఏఐసీఓజీ ప్రకటించింది. ఇలా పేర్చిన ప్యాడ్స్‌ని ఆ తర్వాత కొన్ని పాఠశాలల్లో ఉచితంగా పంపిణీ కూడా చేశారు.

455
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles