ప్యాంట్‌తో చాలెంజ్!


Sat,February 9, 2019 11:04 PM

అక్కడ ఎముకలు కొరికే చలి. వేడి నీళ్లు కూడా మంచుగడ్డలవుతున్నాయ్. ఎలాంటి ద్రవ పదార్థమైనా గాల్లోకి విసిరితే.. ఆవిరైపోతుందక్కడ. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ఓ చాలెంజ్ వైరల్ అవుతుంది.
Pant-Challenge
మంచు ఎక్కువగా కురుస్తున్న ప్రాంతాల్లో ఈ చాలెంజ్ బాగా వైరల్ అవుతుంది. దీని పేరు ఫ్రాజెన్ ప్యాంట్స్ చాలెంజ్. అమెరికాలో పోలార్ వర్టెక్స్ వల్ల మంచు ముంచెత్తి ముప్పు తిప్పలు పెడుతుంటే.. కొందరు మాత్రం ఆ చలినే చాలెంజ్ చేస్తున్నారు. ఇప్పటివరకు వేడి నీళ్లు, కాఫీలను గాల్లోకి ఎగరేసి.. అవి మంచులా ఎలా మారిపోతున్నాయో చూడండి అంటూ వీడియోలు షేర్ చేసిన నెటిజన్లు.. తాజాగా ట్రెండ్ మార్చేశారు. ఈసారి కొత్తగా గడ్డకట్టిన ప్యాంట్లను నిలబెడుతున్నారు. ఫ్రోజెన్ ప్యాంట్స్ పేరుతో సవాళ్లు విసురుకుంటున్నారు. ఈ చాలెంజ్ స్వీకరించే వ్యక్తులు ఇంటి బయటకు తమ ప్యాంట్లను ఎలాంటి ఆధారం లేకుండా విగ్రహాలుగా నిలబెట్టాలి. అదెలా సాధ్యం? ప్యాంట్లు వాటికవే ఎలా నిలబడతాయనే కదా మీ ప్రశ్న! ప్రస్తుతం అక్కడ మైనస్ 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ తీవ్రతకు దారాలను కూడా నిలబెట్టవచ్చు. అయితే, వాటిని నీటిలో తడపాల్సి ఉంటుంది. దానిని పైకి విసిరేస్తే.. పైనే గడ్డకట్టి కిందపడేటప్పుడు మంచులో నిలుచోవాలి. ఇదే ఫ్రోజెన్ ప్యాంట్ చాలెంజ్. అలా నిలబడిన ఫ్యాంట్ల ఫొటోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. వీరు ఇలా ఎంజాయ్ చేస్తారని.. బహుశా ఆ చలి కూడా ఊహించి ఉండదు కదా!

396
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles