పోర్ట్‌ఫోలియోలతో లక్ష్యసాధన సులువు


Fri,September 7, 2018 11:24 PM

మదుపరులతో పోర్ట్‌ఫోలియోల గురించి చర్చించినప్పుడు చాలామంది నుంచి మొదటగా వచ్చే ప్రశ్నలు.. ఈ పోర్ట్‌ఫోలియోలు మార్కెట్ ఒడిదుడుకులను ఎలా అధిగమిస్తాయి?, సూచీలను మించి ఆకట్టుకుంటాయా?, ఇతర పోర్ట్‌ఫోలియోలతో పోల్చితే ఎక్కువ ప్రతిఫలాన్ని అందిస్తాయా? అనేవే. కానీ, పోర్ట్‌ఫోలియోల రూపకల్పనలో ఉన్న ప్రయోజనాలతో చూస్తే ఇవి చాలాచాలా చిన్న సందేహాలు. ఎందుకంటే ఏ ప్రామాణికాన్ని తలదన్నేందుకు వీటి రూపకల్పన జరుగదు. అయితే లక్ష్యాల సాధనకు ఇవి ఎంతగానో దోహదపడుతాయి. నిర్దిష్ట సమయానికి మదుపరులు తమ గమ్యాన్ని చేరేందుకు ఉపయోగపడుతాయి.
stock-market
-నిక్ ముర్రే రాసిన తన ఐదవ ఎడిషన్ సింపుల్ వెల్త్, ఇన్వైటబుల్ వెల్త్‌లో పోర్ట్‌ఫోలియో అనేది ఓ ప్లాన్ కాదు.. అది ఓ సర్వీస్ కూడా కాదని పేర్కొన్నారు. ఊహాగానాల సమాహారంగా మాత్రమే అభివర్ణించారు. పోర్ట్‌ఫోలియోలు ఎలాంటి లక్ష్యాలను సూచిస్తాయంటే.. రిటైర్మెంట్ ప్లాన్ లేదా తమ పిల్లల విద్యకు సంబంధించిన కలల సాకారానికి ఈ పోర్ట్‌ఫోలియోలు ఉపయుక్తంగా ఉంటాయి. ఈ లక్ష్యాల సాధనలో భాగంగా ఎంచుకున్న పోర్ట్‌ఫోలియోల పనితీరు, ప్రదర్శన తేటతెల్లమవుతుంది. అప్పుడే ఈ పోర్ట్‌ఫోలియోలకున్న ప్రాధాన్యాన్ని కూడా మదుపరులు గుర్తిస్తారు. పోర్ట్‌ఫోలియోల సృష్టికున్న విలువ తెలుస్తుంది.

-ఆర్థిక పరిభాషలో పోర్ట్‌ఫోలియో అనేది వ్యక్తిగత, సంస్థాగత పెట్టుబడుల ముఖచిత్రం. స్టాక్స్, బాండ్స్, కమాడిటీస్, కరెన్సీల వంటి నగదు సమానమైన, అలాగే మ్యూచువల్, ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ తదితర వాటిని ప్రతిబింబిస్తుంది. వీటిని మదుపరులు నేరుగా లేదా ఆర్థిక నిపుణులు, మనీ మేనేజర్ల ద్వారా నిర్వహిస్తారు. మీ నమ్మకాలు, నైపుణ్యాలు, అర్హతలు, విద్య, శిక్షణ, అనుభవాలను ఈ పోర్ట్‌ఫోలియోలు ఉదహరిస్తాయి. ఈ పోర్ట్‌ఫోలియోల సృష్టిలో ఆస్తి, నిధులు తదితర ఆర్థిక కేటాయింపులు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతీ పోర్ట్‌ఫోలియో ఓ ప్లాన్‌లోకి ఒకసారి గనుక మారితే.. ఇక దాని చుట్టూతా అనేక లక్ష్యాలు అల్లుకుంటాయి.

-పోర్ట్‌ఫోలియోలు మదుపరుల లక్ష్యాలకు, ప్రాధాన్యతలకూ అద్దం పడుతాయి. అలాగే పెట్టుబడుల్లో మదుపరుల సమస్యలు, నష్టాలకూ నిదర్శనంగా ఉంటాయి. మార్కెట్ ఆధారిత పెట్టుబడులు అంటేనే లాభనష్టాలతో దోబూచులాడేవి. కాబట్టి మన లక్ష్యాలకు అనుగుణంగా వీటిని ఎంచుకుని ముందుకు సాగడమే మన ముందున్న అసలు పని. ఇక వ్యూహాత్మక ఆస్తి, నిధుల కేటాయింపుతో పోర్ట్‌ఫోలియోలపై మరింత ఆసక్తి నెలకొంటుంది. సహజంగా మార్కెట్ అవకాశాల ఆధారంగా ఈ పోర్ట్‌ఫోలియోల పయనం సాగినా.. ఎంచుకునే పెట్టుబడులనుబట్టి నష్టాలకు అతీతంగా లాభాలనూ అందుకోవచ్చు.

-ఏ పెట్టుబడులైనాసరే మన భవిష్యత్ లక్ష్యాల సాధనకు దోహదపడాలని ఆశిస్తాం. ఆకర్షణీయమైన ప్రతిఫలాల్ని అందించాలని కోరుకుంటాం. ఇందుకు తగ్గట్లే కొన్ని పెట్టుబడులు ఆశించిన స్థాయిలో పెద్ద ఎత్తున లాభాల్ని పంచిపెడితే, మరికొన్ని మాత్రం ఊహించనివిధంగా నష్టాలను ఇస్తాయి. అయితే ఓపికతో కూడిన ఇన్వెస్ట్‌మెంట్లు ఎప్పటికైనా లాభాల్నే అందిస్తాయి. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు కాస్త సమయం తీసుకుంటే.. తప్పక అనువైన పరిస్థితులు మనల్ని పలుకరిస్తాయి. నష్టాలను చూసి బెంబేలెత్తిపోవడం అత్యుత్తమ మదుపరుల లక్షణం ఎంతమాత్రం కాదు. కాబట్టి నిలకడైన నిర్ణయాలతో అపజయాలను దూరం చేసుకోండి.
K-NARESH-KUMAR

408
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles