పోరాడి గెలిచింది!


Mon,February 4, 2019 01:23 AM

దేశాన్ని కంటికి రెప్పలా కాపాడే సైనికుడు చనిపోతే అతని కుటుంబం రోడ్డున పడాల్సిందేనా? అని ఓ మహిళ పింఛన్ కోసం 30 యేండ్లు పోరాడింది. 94 యేండ్ల వయసులో అధికారులందరినీ కలిసి తనకు రావలిసిన దానికంటే ఎక్కువ వేతనాన్ని రాబట్టింది.
hebe-benjamin
నిరంతరం దేశాన్ని కాపాడే సైనికులంటే కొంతమందికి చులకన. అయితే సైనికులేమో దేశమే వారి కుటుంబంగా భావిస్తారు. ఒక సైనికుడు చనిపోతే వారి కుటుంబం రోడ్డున పడాల్సిందే. అలాంటి సంఘటనే ఈ వృద్ధురాలికి ఎదురైంది. మన దేశానికి చెందిన కోల్ జార్జ్ బెంజామిన్ అనే ఆర్మీ అధికారి 1966లో పదవీ విరమణ తీసుకున్నాడు. తర్వాత అనారోగ్యంతో 1990లో చనిపోయాడు. దీంతో అతని భార్య హెబే బెంజామిన్ ఇజ్రాయేల్ దేశానికి వెళ్లిపోయింది. అయితే, కొన్నాళ్లకు కోల్‌కు వచ్చే పెన్షన్ ఆగిపోయింది. దీంతో కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఎదురయ్యాయి. దేశ సైనికుడు చనిపోతే వారి కుటుంబానికి అందాల్సిన పింఛన్ గురించి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. కుటుంబ భారం తనమీద వేసుకున్నది హెబే. సరైన ఆదాయం లేక కష్టాలను అనుభవించింది. చివరకు పింఛన్ విషయమై అధికారులకు లేఖ రాయాలనుకున్నది. తమ దగ్గరి బంధువు మన్‌ప్రీత్‌కాంత్ సాయంతో అప్పటి రక్షణ శాఖామంత్రికి విషయం తెలియజేస్తూ లేఖ రాసింది. అయితే, పై నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. రోజులు గడుస్తున్నాయి.. అధికారులు మారుతున్నారు. కానీ, పింఛన్ రావడం లేదు. 94 యేండ్లు వచ్చినా హెబే పట్టువదలకుండా కుటుంబం కోసం పోరాడింది. చివరి ప్రయత్నంగా ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి లేఖ రాసింది. దేశ రక్షణ కోసం పోరాడుతున్న సైనికులకు మీరు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ నిలదీసింది. దీంతో వెంటనే స్పందించిన పీఎంఓ ఆమెకు పింఛన్ ఇవ్వడానికి సిద్ధపడింది. మొత్తం రూ.75 లక్షలు వస్తాయని అనుకున్న హెబేకు.. వడ్డీతో సహా ప్రభుత్వం కోటి రూపాయలు అందజేసింది.

751
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles