పొగతాగడం వల్లేనా?


Mon,February 19, 2018 11:17 PM

నా వయసు 50 సంవత్సరాలు. కొంతకాలంగా విపరీతమైన దగ్గు వస్తున్నది. దగ్గుతోపాటు శ్లేష్మం కూడా పడుతున్నది. కొంచెం బరువైన పని చేసినా సరే ఆయాసంగా ఉంటున్నది. అప్పుడప్పుడు జ్వరం కూడా వస్తున్నది. తీవ్రమైన అలసటగా ఉంటున్నది. నాకు గత 20 సంవత్సరాలుగా సిగరెట్ తాగే అలవాటు ఉంది. రోజుకు 3-5 సిగరెట్లు కాలుస్తుంటాను. నా సమస్య పొగతాగడం వల్లేనా? దగ్గరలో ఉన్న డాక్టర్‌ను సంప్రదించినపుడు పరీక్షలు చేసి నాకు సీఓపీడి అనే వ్యాధి ఉన్నట్టుగా నిర్ధారించారు. సీఓపీడీ అంటే ఏమిటి? దీని చికిత్సా విధానాల గురించి పూర్తి వివరాలు తెలుపగలరు,
రఘుపతి రెడ్డి, నిజామాబాద్

smoking
సీఓపీడి అంటే క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. ఊపిరి తీసుకోవడంలో అవరోధం ఏర్పడుతుంది. గాలి వెళ్లే దారి వాయునాళాలు. వీటి లోపలి వ్యాసం తగ్గిపోతుంది. అందువల్ల తగినంత వాయువు ఊపిరితిత్తుల్లోకి చేరదు. అందువల్ల మీకు ఆయసంగా అనిపిస్తుంటుంది. దీనికి మీరు దీర్ఘకాలికంగా చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. వాయునాళాల లోపలి వ్యాసార్థం పెరిగేందుకు ఉపకరించే మందులను సూచిస్తారు. వీటిని బ్రాంకో డైలేటర్స్ అంటారు. డాక్టర్ సూచనల మేరకు వీటిని క్రమం తప్పకుండా వాడాల్సి ఉంటుంది. శ్వాస సంబంధమైన ఇన్‌ఫెక్షన్ ఏదైనా సోకినట్టు అనుమానం వచ్చినా లేక ఆయాసం పెరిగినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. ఆయసం చాలా ఎక్కువగా ఉన్నపుడు ఊపిరితిత్తులకు రిహాబిలిటేషన్ వ్యాయామాలు చేయించాల్సిన అవసరం ఉంటుంది. ఇందుకోసం పల్మనాలజిస్ట్, రెస్పిరేటరీ టెక్నిషియన్ సూచనలు తీసుకోవడం వసరం. ఈ చికిత్సలతో పాటు మీరు పొగతాగే అలవాటును వెంటనే మానెయ్యాలి. అంతేకాదు పొగతాగే వారి చుట్టుపక్కల కూడా ఉండకుండా జాగ్రత్త పడాలి. పరీక్షలు చేయించుకోవడం, మందులు వాడడం క్రమం తప్పకూడదన్న విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ సూచనలన్నీ పాటిస్తే మీరు త్వరగానే కోలుకోవడానికి అవకాశం ఉంటుంది.
rafi

384
Tags

More News

VIRAL NEWS