పేపర్ వెయిట్ వజ్రం ఖరీదు రూ.900 కోట్లు!


Thu,February 28, 2019 01:51 AM

ఇది మామూలు పేపర్ వెయిట్ కాదు చాలా ఖరీదైన వజ్రం. ప్రపంచంలోనే ఏడో అతిపెద్ద వజ్రం ఇది. కోహినూర్ వజ్రం కంటే కూడా ఇదే పెద్దది. దీనిని జాకబ్ డైమండ్ అంటారు. దీని విలువ సుమారు రూ.900 కోట్లు. ప్రస్తుతం దీనిని ఢిల్లీ నేషనల్ మ్యూజియంలో ప్రదర్శన కోసం ఉంచారు.
costly-paper-wait
నిజాం ట్రస్టు ఆధీనంలో ఉన్న నిజాం నవాబుకు చెందిన నగలను, కేంద్రప్రభుత్వం సేకరించి ఢిల్లీ జాతీయ మ్యూజియంలో ప్రదర్శనకు పెట్టింది. ఈ వజ్రాన్ని ఆరో నిజాం జాకబ్ అనే వ్యక్తి వద్ద నుంచి కొనుగోలు చేసినట్లు ఆధారాలున్నాయి. 1890లో మాల్కమ్ జాకబ్ అనే వజ్రాల వ్యాపారి హైదరాబాద్‌లో ఆరో నిజాం మహబూబ్ అలీ ఖాన్‌కు ఈ వజ్రం నమూనాను చూపించాడు. అసలు వజ్రాన్ని కోటీ 20 లక్షలకు బేరం పెట్టాడు. కానీ నిజాం 46 లక్షలు మాత్రమే ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. మొత్తానికి దానిని కొనుగోలు చేయడానికి ఒప్పందం జరిగిపోయింది. సగం మొత్తం తీసుకున్న తర్వాత జాకబ్‌తో ఇంగ్లండ్ నుంచి వజ్రాన్ని తెప్పించాడు. కానీ, నిజాం తర్వాత దాన్ని తీసుకోవడానికి నిరాకరించాడు. అంతేకాకుండా ఇచ్చిన డబ్బు తిరిగి ఇచ్చేయమన్నాడు. దీనికి కారణం నిజాం అప్పుల్లో ఉండడమే అంటారు. అందుకే బ్రిటిష్ రెసిడెంట్ ఈ వజ్రం కొనుగోలును వ్యతిరేకించారట. జాకబ్ డబ్బు తిరిగివ్వడానికి కోల్‌కత హైకోర్టులో కేసు నమోదయింది. 1892లో నిజాంకు ఆ వజ్రం అందింది. ఆ తర్వాత కోర్టు వివాదాలతో విసిగిపోయిన ఆరో నిజాం (మీర్ ఉస్మాన్ అలీ ఖాన్) ఆ వజ్రాన్ని తన టేబుల్ సొరుగులో పెట్టాడు. తర్వాత ఏడో నిజాంకు ఈ వజ్రం పాత చెప్పుల మధ్య దొరికింది. అప్పటి నుంచి ఆయన ఈ వజ్రాన్ని పేపర్ వెయిట్‌గా ఉపయోగించుకున్నాడు. ఈ పేపర్ వెయిట్ వజ్రం 184.75 క్యారెట్లు ఉంటుంది.

635
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles