పెప్టిక్ అల్సర్


Tue,November 18, 2014 11:54 PM

మనిషి జీవిత కాలంలో పెప్టిక్ అల్సర్లు సుమారు 11.28 శాతం ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం మనదేశంలో ఈ అల్సర్ల వల్ల కలిగే దుష్పరిణామాల వలన 1.2 శాతం మరణాలు సంభవిస్తున్నాయి. మన శరీరంలో ఏ భాగంలోనైనా దీర్ఘకాలికంగా మానకుండా ఉండే పుండు లేదా వ్రణమును అల్సర్ అని అంటారు. జీర్ణాశయంలో గాని, ఆంత్రమూలం (జీర్ణాశయాన్ని ఆనుకుని ఉండే చిన్నపేగు)లో గాని ఏర్పడే పుండ్లను వైద్యపరిభాషలో పెప్టిక్ అల్సర్ అంటారు. సాధారణంగా జీర్ణాశయంలో ఏర్పడే పుండ్లను గ్యాస్ట్రిక్ అల్సర్ అని ఆంత్రమూలంలో ఏర్పడే పుండ్లను డుయోడినల్ అల్సర్ అని అంటారు.

peptic-ulcer-symptoms

కారణాలు


హెలికోబాక్టర్ పైలోరి అనే సూక్ష్మక్రిములు 80 శాతం పెప్టిక్ అల్సర్లకు కారణమవుతాయి. జీర్ణాశయంలో అవసరానికన్నా ఎక్కువ ఆమ్లాలు ఉత్పన్నమైనప్పుడు లేదా అన్నవాహిక లోపలివైపుగా ఉండే పొరలో ఏదైనా ఇతర కారణాల చేత దెబ్బతిన్నప్పుడు ఈ ఆమ్లాలు వీటిపై ప్రభావం చూపడం వల్ల అల్సర్లు ఏర్పడతాయి.
-శారీరక, మానసిక ఒత్తిడి
-ఆహారంలో కారం, పులుపు, మసాలాలు అధికంగా వాడడం, అపరిమితంగా మద్యం సేవించడం, పొగతాగడం, దీర్ఘకాలికంగా నొప్పి నివారించే మాత్రలు వాడడం వలన అల్సర్లు ఏర్పడే అవకాశం ఉంది.
-వంశపారంపర్యంగా వచ్చే జన్యువు వల్ల కూడా అల్సర్లు ఏర్పడవచ్చు.

డుయోడినల్ అల్సర్ లక్షణాలు


ఇది సాధారణంగా 20 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసువారిలో అందులోనూ స్త్రీల కంటే పురుషుల్లో రెండు రెట్లు అధికంగా వచ్చే అవకాశం ఉంది. కడుపు పై భాగంలో మంటతో కూడిన నొప్పి, అన్నం తిన్న తరువాత ఉపశమనం కలగడం, తిన్న రెండు మూడు గంటల తరువాత నొప్పి అధికమవడం, కడుపుబ్బరం వంటి లక్షణాలు ప్రధానమైనవి. అల్సర్లు తీవ్రతరం అయినవారిలో రక్తస్రావం జరిగి మలంలో రక్తం కనబడుతుంది.

గ్యాస్ట్రిక్ అల్సర్ లక్షణాలు


సాధారణంగా గ్యాస్ట్రిక్ అల్సర్లు 50 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు స్త్రీ, పురుషులలో సమానంగా చూడవచ్చు. మంటతో కూడిన కడుపునొప్పి, అన్నం తిన్న వెంటనే నొప్పి అధికమవడం, తేన్పులు, అన్నం అరగకపోవడం, ఛాతిలో మంట, ఆకలి మందగించడం, బరువు తగ్గడం, వాంతులవడం, వాంతి అయిన తరువాత నొప్పి నుంచి ఉపశమనం కలగడం వంటివి గ్యాస్ట్రిక్ అల్సర్లలోని సాధారణ లక్షణాలు. అల్సర్లు తీవ్రతరం అయితే రక్తస్రావం జరిగి కాఫీ డికాషన్ లాగా వాంతులవడం వంటి తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి.

నిర్ధారణ పరీక్షలు


రోగి లక్షణాలను బట్టి గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ఎండోస్కోపీ, బేరియం ఎక్స్‌రే, రాపిడ్ బయాప్సీ ద్వారా వ్యాధి నిర్ధారించబడుతుంది.

srikanth

హోమియో చికిత్స


పెప్టిక్ అల్సర్లను జీవనశైలి వ్యాధులుగా చెప్పుకోవచ్చు. ఆహారంలో అధికంగా మసాలాలు, నూనె పదార్థాలు, టీ, కాఫీ, మద్యం సేవించడం, పొగ తాగడం, శారీరక శ్రమ తక్కువగా ఉండే జీవనశైలి, సరైన వ్యాయామం కొరవడడం, తరచు కోపం, ఉద్రేకం రావడం వంటివి వీరిలో ఎక్కువ. హోమియోపతి వైద్యం ద్వారా వ్యాధికి మూల కారణాన్ని గుర్తించి, వ్యక్తి నిర్మాణం, శారీరక, మానసిక లక్షణాలను బట్టి చికిత్స ఇవ్వడం ద్వారా వ్యాధిని సంపూర్ణంగా నయం చేయవచ్చు. రక్తస్రావం కావడం వంటి తీవ్రపరిణామాలు కలుగకుండా కాపాడవచ్చు. జెనెటిక్ కాన్‌స్టిట్యూషనల్ వైద్యం ద్వారా రోగనిరోధక శక్తిని మెరుగుపరిచి వ్యాధిని నయం చేసే సామర్థ్యాన్ని పెంచవచ్చు. ఎలాంటి దుష్ఫలితాలు లేకుండా సమూలంగా నిర్మూలించవచ్చు.

8454
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles