పెట్టుబడుల ఆకర్షణలో మనమే టాప్!


Sat,February 9, 2019 01:45 AM

భారత్ రియల్ రంగంలో మూలధన పెట్టుబడులు క్రమంగా తగ్గుముఖం పడుతుంటే హైదరాబాద్ రియల్ రంగం మాత్రం ఏటా పై పైకి ఎగబాకుతున్నదని కుష్‌మన్ అండ్ వేక్ ఫీల్డ్ ఇటీవల విడుదల చేసిన నివేదికలో స్పష్టం చేసింది. దీని ప్రకారం, భారత రియల్ రంగం 2018లో 6.8 బిలియన్ ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులను మాత్రమే ఆకర్షించి 2007 మాదిరిగా అత్యంత తక్కువ పెట్టుబడులను ఆకర్షించింది. ఏటా 10.6శాతం తగ్గుదలను నమోదు చేస్తున్నది. అయితే హైదరాబాద్ మాత్రం ఆశ్చర్యకరమైన వృద్ధిని నమోదు చేసినట్లు నివేదిక వెల్లడించింది. హైదరాబాద్ రియల్ రంగంలోకి వచ్చిన పెట్టుబడుల విలువ 2017లో 2శాతం నుంచి 17 శాతానికి ఎగబాకింది. 2018లో నగరంలో లీజింగ్ కార్యకలాపాలు 10 మిలియన్ చదరపు అడుగులకు చేరింది. కీ ఆఫీస్ కారిడార్స్, క్వాలిటీ ఆఫీస్ విషయంలో హైదరాబాద్ పెద్దమొత్తంలో సంస్థాగత పెట్టుబడులను ఆకర్షిస్తున్నది. గ్జాండర్, బ్లాక్‌స్టోన్, అసెండాస్ ఇండియా ట్రస్ట్, అలియంజ్ -షాపూర్జీ పల్లోంజీ వంటి నాలుగు వేర్వేరు కార్యాలయాల రూపంలో రూ. 6550 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇక హైదరాబాద్ తర్వాత చన్నై 13శాతం పెట్టుబడులను ఆకర్షించింది. గత త్రైమసికంలో నగరానికి వచ్చిన ఎస్‌పీ ఇన్ఫోసిటీ పెట్టుబడుల వల్ల ఇది సాధ్యమైంది. భారత రియల్ రంగంలో క్షీణిస్తున్న పెట్టుబడులు.. గత త్రైమాసికంలో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల లిక్విడిటీ సంక్షోభానికి కారణమైనట్లు కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ నివేదిక స్పష్టం చేసింది. గత త్రైమాసికంలో పెట్టుబడుల ప్రవాహం 23.4శాతం క్షీణించి రూ. 8,450 కోట్లకు పడిపోయింది. 2019లో ప్రైవేట్ ఈక్విటీ ట్రెండ్‌లో ఆశించదగిన వృద్ధి లభిస్తుందని నివేదిక వెల్లడించింది. భవిష్యత్‌లో భారత్ ఆఫీస్ సముదాయాల్లో దూసుకుపోయే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది.

217
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles