పెండ్లి బట్టలే ప్రత్యేక ఆకర్షణగా..


Sat,February 9, 2019 11:05 PM

ఒక దోస్త్ పెండ్లికి వెళ్తున్నామంటే ఎంత హడావుడి అవుతుంది. అదే అమ్మాయిలకైతే ఎంత ప్లాన్ ఉండాలి. డ్రెస్సింగ్స్, టైమింగ్స్, గిఫ్ట్స్ ఇలా చాలా రకాల ప్లాన్‌లు ఉంటాయి. అక్కడికి వెళ్లిన తర్వాత తెలిసిన ఫ్రెండ్ ఒకరు మ్యాచింగ్ డ్రెస్ వేసుకొస్తే ఎంత ఆశ్చర్యమేస్తుంది. అంతకు మించిన ట్విస్ట్ ఒకటి లాస్‌ఏంజిల్‌లో ఓ వివాహ వేడుకలో జరిగింది.
bride
వివాహం అనగానే కొత్త బట్టలు అవసరం... అది వివాహానికి వెళ్లే వారికైనా, వివాహం చేసుకొనే వారికైనా ముఖ్యమైన అంశం. వివాహానికి వెళ్లే వారు కొత్త బట్టలు కొనుక్కొని వేసుకుంటే మళ్లీ మళ్లీ వాటిని వేసుకోవచ్చు. కానీ వివాహం చేసుకునే వారు వెడ్డింగ్ డ్రెస్‌ను ఎన్నిసార్లు వేసుకుంటారు. కేవలం పెండ్లి వేడుకలోనే ఆ డ్రెస్ వేసుకుంటారు. తర్వాత దాన్ని మళ్లీ వేసుకోవడానికి కుదరదు. ఎంత ఖరీదైన డ్రెస్ అయినా పక్కకు పెట్టాల్సిందే కానీ లాస్‌ఏంజిల్‌లో ఆండ్రెయ్ మూర్ అనే నటి వివాహానికి వచ్చిన వారంతా తమ వెడ్డింగ్ డ్రెస్‌ను వేసుకుని వచ్చారు. అది ఎలా అంటే ఆండ్రెయ్ తన వివాహానికి ఆహ్వానించిన వారిని పాతవెడ్డింగ్ డ్రెస్‌ను వేసుకురావా లని కోరింది. అంతకు ముందు ఆమె ఓ పెండ్లికి వెళ్లినప్పుడు పెండ్లి కూతురు వేసుకున్న డ్రెస్ గురించి తండ్రిని అడిగినప్పుడు దాన్ని మళ్లీ వేసుకోరు అని చెప్పారటా. దీంతో దాన్ని మళ్లీ ఎందుకు వేసుకోకూడదు అని ఆలోచించి తన పెండ్లికి వచ్చే వారి అందరితో తమ పెండ్లి డ్రెస్ వేసుకురావాలని కోరింది. దీంతో అందరూ ఒకరికి తెలియకుండా ఒకరు వేసుకుని వచ్చారు. వేడుకలో ఈ ట్విస్ట్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

526
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles