పెండ్లిళ్లు చేస్తున్న పూజారిణి!


Mon,February 18, 2019 01:09 AM

ఇప్పటిదాకా సంప్రదాయాల పేరుతో అర్చకత్వానికి మహిళలను దూరంగా ఉంచారు. ఇప్పుడు కోల్‌కతలో నందిని భువ్మిక్ అనే మహిళ పూజారిణిగా మారి పెండ్లిళ్లు చేస్తున్నది.
Nandini-Bhowmik
అనాదిగా మహిళలకు అన్యాయమే జరుగుతున్నది. ఇప్పడిప్పుడే సమాజంలో కొద్ద్దో గొప్పో చైతన్యం పెరగడంతో అడుగు పెట్టలేని రంగాల్లోనూ మహిళలు తమదైన శైలిలో ముందు వరుసలో నిలబడుతున్నారు. అదే కోవకు చెందిందీ నందినీ భువ్మిక్. అర్చకత్వాన్ని చేపట్టి పూజారిణిగా మారి పశ్చిమ బెంగాల్‌ల్లో పెండ్లి తంతులు నిర్వహిస్తున్నది. విశేషమేమిటంటే కన్యాదానం లేకుండానే పెండ్లిళ్లు చేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నది. పదేండ్ల కిత్రం నందిని కోల్‌కతాలోని జాదవ్‌పూర్ యూనివర్సిటీలో సంస్కృత భాషా విభాగంలో అధ్యాపకురాలిగా పనిచేసింది. అదే సమయంలో సంస్కృతంలో అధ్యాపకుడైన గౌరీ శంకర్ మలాల్ హిందూ ఆచారాలు,ధర్మ సందేహాలను గురించి కొంతమంది మహిళలకు తరగతులు నిర్వహిస్తున్నారు. ఆ తరగతులకు నందినీ కూడా హాజరై హిందూ శాస్ర్తాలను ఔపోసన పట్టింది.


ఆ తర్వాత పెండ్లి తంతు నిర్వహించేందుకు కొత్త విధానాన్ని రూపొందించింది. నందినితోపాటు రుమా రాయ్, సెమంతి బెనర్జీ, పౌలమీ చక్రవర్తిలతో ఓ బృందంగా ఏర్పడి పలురకాల శుభకార్యాలను నిర్వహిస్తున్నారు. వధూ, వరులిద్దరికీ సమాన గౌరవం కల్పించాలనే ఉదేశంతోనే నందిని కన్యాదానం లేకుండా పెండ్లిళ్లు చేస్తున్నది. కొంతమంది ఈ విధానాన్ని తప్పుబట్టినా, ఎక్కువ మంది ఆమె విధానమే బాగుందని ప్రశంసిస్తున్నారు. అయితే నందిని హిందూ సంప్రదాయాలపై తమకూ నమ్మకం ఉన్నదని, ఆయా సంప్రదాయాలను గౌరవిస్తూనే కొత్త విధానంలో పెండ్లిళ్లు చేస్తున్నానని చెబుతున్నది. ఎవరు ఏ విధంగా చేసినా వధూవరులిద్దరూ సంతోషంగా బతుకడమే కావాలని కోరుకుంటున్నానని ఆమె తెలిపింది.

757
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles