పెండ్లికి పుస్తకాలే చదివింపులు..


Sun,February 3, 2019 12:42 AM

సుభాష్, శార్వరి అనే మేమూ ఒకరినొకరం అర్థం చేసుకుంటామనీ భారత రాజ్యాంగం సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం. ఎలాంటి సనాతన సంప్రదాయాలకు తావు ఇవ్వకుండా, హేతుబద్ధంగా ఒకరికొకరం మనస్ఫూర్తిగా ఇష్టపడి చేసుకుంటున్న వివాహం ఇది.. అంటూ ఓ దంపతులు పెండ్లినాడు ప్రమాణాలు చేశారు.
castless-wedding
మహారాష్ట్రలోని పుణెలో సామాజిక సేవకులు సచిన్ ఆశ సుభాష్, శార్వరి సురేఖ అరుణ్ కుల కట్టుబాట్లను తోసిపుచ్చి ఇలా వినూత్నంగా వివాహం చేసుకున్నారు. ఆహ్వాన పత్రిక కూడా ఎవ్వరికీ పంపకుండా సోషల్ మీడియా ద్వారా అందరినీ ఆహ్వానించారు. బహుమతులకు బదులుగా పుస్తకాలు ఇవ్వాలని కోరారు. దేశమంతా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మునిగి ఉన్నప్పుడు సత్యశోధక్ మార్గంలో ఈ జంట ఏకమయ్యారు. పూజారులు, ఆచారాలు లేకుండా వివాహం చేసుకున్నారు. వీరిద్దరు సామాజిక కార్యకర్తలు. రెండేండ్ల క్రితం ఓ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఇరువురికి పరిచయం ఏర్పడింది. అనంతరం ఇద్దరి అభిప్రాయాలు కలవడంతో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆడంబరాల జోలికి పోకుండా తమ వివాహానికి వచ్చేవారు బహుమతులకు బదులు పుస్తకాలు ఇస్తే చాలు అని ఆహ్వానంలోనే చెప్పారు. అలా 1000 మందిని వివాహానికి ఆహ్వానించారు. 1200 పుస్తకాలు బహుమతులుగా వచ్చాయి. వాటన్నింటినీ గ్రామాల్లోని గ్రంథాలయాల్లో ఇవ్వనున్నట్లు ఈ నవదంపతులు చెబుతున్నారు. అంతే కాకుండా వివాహం తర్వాత ఇంటి పేర్లను సైతం మార్చుకోకుండా అలాగే ఉంచుకుంటామనీ, హేతుబద్ధగా లేని ఏ సంప్రదాయాలను మేం పట్టించుకోలేమని వారు స్పష్టం చేశారు.

622
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles