పృథ్వీశాస్త్రం శక్తి సంచలనం!


Tue,February 19, 2019 01:39 AM

భూమి ఉత్తర ధ్రువ అయస్కాంత క్షేత్రం గణనీయంగా కదులుతున్నట్లు భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఇటీవల నిర్ధారించారు. దీని ఫలితంగా ప్రపంచానికి ఏం ఉపద్రవాలు సంభవిస్తాయోనన్న ఆందోళన కూడా వారిలో వ్యక్తమవుతున్నది.
Pridhwee-Shastram
ప్రతి 10 లక్షల సంవత్సరాలకు సగటున మూడుసార్లు భూమి అయస్కాంతత్వం స్థానభ్రంశం చెందుతున్నట్టుగా ప్రాచీన, ప్రస్తుత రికార్డులు, పరిశోధనలనుబట్టి శాస్త్రవేత్తలు గుర్తించారు. 2015లో అది ఎక్కడైతే (కెనడా) ఉండిందో ఇప్పుడు అక్కడ లేదు. సైబేరియా వైపు ఏడాదికి 30 మైళ్ల చొప్పున కదులుతున్నదని వారు చెప్పారు. వరల్డ్ మాగ్నటిక్ మోడల్‌ను వారు తాజాగా విడుదల చేశారు. సెల్‌ఫోన్లలోని జిపిఎస్ వ్యవస్థ, మిలటరీ నావికాదళ అధికారులకు ఈ సమాచారం ఉపయోగపడుతుంది. కాకపోతే, అర్కిటిక్ ప్రాంతంలోని వారికి మాత్రమే దీని కదలికలోని మార్పు, పర్యవసానాలు కొంత స్పష్టంగా తెలుస్తాయని వారు అంటున్నారు. ఇంగ్లాండ్, వెస్ట్ యార్క్‌షైర్‌కు చెందిన లీడ్ నగరంలోని యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్ పరిశోధకులు దీనిని గుర్తించారు. భూమి ఉపరితలం కింద సుమారు 2,000 మైళ్ల అడుగున అయస్కాంత క్షేత్రం ఉద్భవిస్తున్నదని, అక్కడ సంభవించే తీవ్ర పరిణామాలే ఈ సంచలనానికి కారణమవుతున్నట్టు వారు తెలిపారు. 1831లో మొట్టమొదటిసారిగా ఉత్తర అయస్కాంతత్వాన్ని కెనడియన్ అర్కిటిక్ ప్రాంతంలో గుర్తించగా, 1940 కల్లా అది వాయవ్యం వైపు 250 మైళ్ల దూరం కదిలింది. 1990 నాటికి మరో 600 మైళ్లు జరిగింది. ఐతే, దక్షిణ ద్రువ అయస్కాంతత్వంలో మాత్రం ఎలాంటి మార్పులు లేవు. ఉత్తర ధ్రువంలోనే అది ముఖ్యంగా కెనడియన్ భూభాగంలో 2017 కల్లా బాగా బలహీనపడింది. ఇది ఏ ఉపద్రవాలకు దారితీస్తుందో అన్న భయాందోళనలూ వ్యక్తమవుతున్నాయి.

471
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles