పురుషుల కంటే ఎక్కువ కాల్షియం?


Wed,August 3, 2016 01:02 AM

రక్తపోటు నియంత్రణలో ఉండడం, హృదయ స్పందన లయబద్ధంగా ఉంచడం వంటి ముఖ్యమైన అంశాలు శరీరంలోని కాల్షియం స్థాయి మీద ఆదారపడి ఉంటాయి. కాల్షియం కేవలం ఎముకల దృఢత్వానికి మాత్రమే కాదు శరీరంలో నాడివ్యవస్థ అధీనంలో జరిగే అనేక జీవక్రియలకు కూడా అత్యంత అవసరమైన పోషకం. మన శరీరంలో కాల్షియం ఎక్కువగా కలిగిన అవయవ వ్యవస్థ అస్తిపంజర వ్యవస్థ. ఒకవేళ ఆహారంలో కాల్షియం కొరవడితే జీవక్రియలకు అవసరమైన కాల్షియాన్ని శరీరం ఎముకల నుంచి స్వీకరిస్తుంది. అందువల్ల కాల్షియం కొరవడినపుడు ఎముకలు బలహీన పడుతాయి.

స్త్రీలకు మరింత అవసరం


పురుషుల కంటే స్త్రీలకు కాల్షియం ఎక్కువ అవసరమవుతుంది. ఎందుకంటే పురుషుల కంటే స్త్రీల ఎముకల సాంద్రత తక్కువగా ఉంటుంది. అందువల్ల తక్కువ మొత్తంలో కాల్షియం తగ్గినప్పటికీ ఎముకలు బలహీనపడి త్వరగా ఆస్టియోపొరోసిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మెనోపాజ్ దశలో ఉన్న మహిళలకు ఈ ప్రమాదం మరింత ఎక్కువ. అందుకే అదే వయసులో ఉన్న పురుషులకంటే కూడా స్త్రీల కాల్షియం అవసరాలు భిన్నంగా ఉంటాయి. అందుకే ఈ వయసులో ఉన్న స్త్రీలు ఎముకలు బలహీనపడకుండా ఉండేందుకు తప్పనిసరిగా సరిపడినంత విటమిన్ డి తోపాటు కాల్షియం కూడా తీసుకోవాల్సి ఉంటుంది. మెనోపాజ్ వయసులో ఉన్న మహిళలకు రోజుకు కనీసం 1200 మిల్లీ గ్రాముల కాల్షియం అవసరమవుతుంది. అయితే కాల్షియం సప్లిమెంట్లు తీసుకునే వారు రోజుకు 2000 మిల్లీ గ్రాములకు మించకుండా కూడా జాగ్రత్తపడాలి. సప్లిమెంట్ల రూపంలో కాల్షియం తీసుకోవడం కంటే రోజుకు కనీసం మూడు సార్లు పాలు, పెరుగు ఇతర పాల పదార్థాల రూపంలో కాల్షియం తీసుకోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
MILK

2079
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles