పురుషులకు కూడా..


Wed,February 17, 2016 12:37 AM

man
ఒక సర్వే ప్రకారం దాదాపు పావు వంతు మంది పురషులు తాము కూడా స్త్రీలు నెలసరి సమయంలో పొందే అనుభవాలు తమకు కూడా కలుగుతున్నాయని వెల్లడిచేశారు.
చాలా మంది స్త్రీలలో నెలసరికి ముందు రకరకాల శారీరక మానసిక సమస్యలు వస్తుంటాయి. ఇలా నెలసరి ముందు సమస్యలు రావడాన్ని ప్రిమెన్సువల్ సిండ్రోమ్ అంటారు. ఇలాంటి సమస్యతో బాధపడుతున్న స్త్రీల భాగస్వాముల్లో దాదాపు మూడు వంతుల మంది వారిలో కూడా ప్రతి నెలా ఇలాంటి మార్పులే కలుగుతున్నట్లు గుర్తించారు.

ఇందులో భాగంగా 56 శాతం మంది చిరాకుగా ఉంటున్నట్టు
51 శాతం మంది మిగతా రోజులకంటే అలసటగా ఉంటున్నట్టు
47 శాతం మందికి ఐస్ క్రీములు, చాక్లెట్లు ఎక్కువగా తినాలనిపిస్తున్నట్టు
43 శాతం మందికి ఎప్పుడూ ఆకలిగా ఉన్న భావన కలుగుతున్నట్టు
43 శాతం మందికి చాలా త్వరగా మూడ్ స్వింగ్ అవుతున్నట్టు
15 శాతం మంది కడుపుబ్బరంగా ఉట్టున్నట్టు
5 శాతం మంది కండరాలు పట్టినట్టు ఉట్టున్నట్టు వెల్లడించారు.
స్త్రీలలో మాదిరిగానే ప్రతి నెల రోజుల వ్యవధిలో పురుషుల్లో కూడా హార్మోన్ల స్థాయిల్లో తేడాలుండడాన్ని పరిశోధకులు గమనించారు. దీని ప్రకారం పురుషుల్లో కూడా పైకి కనిపించని నెలసరి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.

1891
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles