పుణ్యస్నానానికి వేళ ఇదే!


Fri,February 8, 2019 01:13 AM

Ilacheddam
మాఘ, ఫాల్గుణ మాసాలు శుభకార్యాలకు మాత్రమే కాక పుణ్యకార్యాలకు కూడా ఎంతో ఉత్తమమైన మాసాలుగా శాస్ర్తాలు చెబుతున్నాయి. మాఘమాసం విశిష్ఠతను మాఘపురాణం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ నెలలో మనం చేయాల్సిన మంచి పనులలో నదీ స్నానం ఒకటి. శుభ్రమైన జలాలు వున్న యెడల చెరువులు, కాల్వలలోనూ పుణ్యస్నానం చేయవచ్చు. ఇంకా సముద్ర స్నానాలు కూడా ఆచరించవచ్చునని పెద్దలు అంటారు. మూడుసార్లు నీళ్లలో మునిగి సూర్యునికి నమస్కారం చేయాలి. ఎందుకంటే, ఈ నెలలోనే రథసప్తమి పర్వదినమూ వస్తుంది కనుక సూర్యుని ఆరాధన అత్యంత పుణ్యప్రదం. మాఘ పురాణంలో మొత్తం 30 అధ్యాయాలుండగా, చివర ఫలశ్రుతి ఉంటుంది. ఒకటో అధ్యాయంలోనే మాఘమాస విశిష్ఠతను చదువుతాం. అలాగే, మాఘస్నానానికి సంబంధించిన సంకల్ప విధానమూ ఇందులోనే ఉంటుంది.

319
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles